Hyderabad To Somasila Tour | రూ. 4 వేలకే సోమశిల ట్రిప్.. తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ
Hyderabad To Somasila Tour | ఈ వేసవిలో సోమశిల టూర్ వెళ్లాలని ఉందా? అయితే మీకోసం తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. సోమశిల (Somasila), శ్రీశైలం (Srisailam) తదితర ప్రాంతాలను చూసేందుకు హైదరాబాద్ నుంచి సూపర్ ప్యాకేజీని ప్రకటించింది.
Hyderabad To Somasila Tour | నల్లమల పచ్చదనం, కృష్ణానది ప్రవాహం, ఆధ్యాత్మిక సౌరభం.. ఇలా కొల్లాపూర్ ప్రత్యేకతలు కోకొల్లలు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో సోమశిల పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఆవైపు సంగమేశ్వరాలయం, ఈవైపు సోమేశ్వరాలయం.. పుణ్యరాశిగా వెలిశాయి. ఇక్కడి ప్రకృతి అందాలు పాపికొండలకు దీటుగా నిలుస్తాయి. దీంతో పర్యాటకులు వేసవిలో సోమశిలకు క్యూ కడుతుంటారు. అయితే ఈ వేసవిలో సోమశిల టూర్(Somasila Tour) వెళ్లాలని ఉందా? అయితే మీకోసం తెలంగాణ టూరిజం(Telangana Tourism) గుడ్ న్యూస్ చెప్పింది. సోమశిల, సంగమేశ్వర ఆలయం (Sangameshwara temple), సోమేశ్వరాలయం (Someshwara temple), శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి(mallikarjuna temple), భ్రమరాంబదేవి (bramarambha devi) దర్శనం తదితర ప్రాంతాలను చూసేందుకు హైదరాబాద్ నుంచి సూపర్ ప్యాకేజీని ప్రకటించింది.
హైదరాబాద్ – శ్రీశైలం- సోమశిల (Hyderabad – Srisailam – Somasila) పేరుతో తెలంగాణ టూరిజం ఈ టూర్ ప్యాకేజీని (Road cum River Cruise Tour) అందిస్తోండగా.. ప్రతి శనివారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో సోమశిల (Somasila) ఆంకాళమ్మకోట, బోట్ టూర్, శ్రీశైలం మల్లికార్జున స్వామి (Mallikarjuna swamy), భ్రమరాంబదేవి దర్శనం తదితర పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 1 రాత్రి, 2 రోజులు కొనసాగుతుంది.
సోమశిల ప్రయాణం సాగుతుంది ఇలా
Day 01: మొదటి రోజు హైదరాబాద్లో టూర్ ప్రారంభం అవుతుంది. ఉదయం 9:00 గంటలకు బషీర్బాగ్ నుంచి (09.00 గంటలకు) బస్సు బయలుదేరుతుంది. మధ్యాహ్న భోజనానికి మార్గంలో స్టాప్ ఉంటుంది. భోజనం తర్వాత మార్గమధ్యంలో సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం శ్రీశైలం చేరుకుని.. బస కోసం నేరుగా హోటల్కు వెళతారు. శ్రీశైలంలోనే రాత్రి బస ఉంటుంది. (పర్యాటకులు సాయంత్రం లేదా తెల్లవారుజామున దర్శనం చేయవలసి ఉంటుంది.)
Day 02: రెండో రోజు ఉదయం అల్పాహారం చేసి. ఉదయం 9:00 గంటలకు శ్రీశైలం నుంచి లాంచీలో సోమశిలకు ప్రయాణం ఉంటుంది. మార్గమధ్యలో ఆంకాళమ్మకోట, కృష్ణా నది బ్యాక్ వాటర్స్, పక్కనే నది మధ్యలో వెలసిన ద్వీపంలో జాలర్ల నివాసాలు అబ్బురపరుస్తాయి. అనంతరం సంగమేశ్వర ఆలయం (Sangameshwara temple), సోమేశ్వరాలయం (Someshwara temple) దర్శనం ఉంటుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5 గంటలకి సోమశిల నుంచి బస్సు అందుబాటులో ఉంటుంది. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
హైదరాబాద్ టూ సోమశిల టూర్ ప్యాకేజీ ధర
Hyderabad to Srisailam Tour cost | నాన్ AC బస్ ప్యాకేజీలో పెద్దలకు రూ.4499, పిల్లలు (5 నుంచి 12సంవత్సరాలు) రూ.3600 చెల్లించాల్సి ఉంటుంది. ఇక టూర్ ప్యాకేజీలో బస్సు టికెట్లు, దర్శనం, బోట్ ఛార్జీలు, హోటల్లో వసతి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.
పూర్తి వివరాల కోసం.. telangana tourism క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
https://tourism.telangana.gov.in/package/hydsomasilasrisailam
Read Today's Latest Tourism News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

