11 నుంచి యాదగిరిగుట్ట నర్సన్న బ్రహ్మోత్సవాలు.. ముస్తాబవుతున్న పంచనారసింహుడి క్షేత్రం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుంచి మార్చి 21 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 11న స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేరాధన, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 21న అష్టోత్తర శతఘటాభిషేకం, డోలోత్సవంతో ఉత్సవాలు సంపూర్ణం కానున్నాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుంచి మార్చి 21 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 11న స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేరాధన, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 21న అష్టోత్తర శతఘటాభిషేకం, డోలోత్సవంతో ఉత్సవాలు సంపూర్ణం కానున్నాయి. 17న ఎదుర్కోలు, 18న స్వామివారి తిరు కల్యాణోత్సవం, 19న దివ్య విమాన రథోత్సవం, 20న మహాపూర్ణాహుతి, చక్రతీర్థం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 13నుంచి 19 వరకు స్వామివారి అలంకార సేవలు సాగనున్నాయి.
యాదగిరిగుట్టలో 10 రోజులు సాగే బ్రహ్మోత్సవాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణమంతా విద్యుద్దీప కాంతులతో మిరిమిట్లు గొలిపే విధంగా అద్భుతంగా రూపొందించనున్నారు. ఇప్పటికే ముఖ మండపంలో దీపాలంకరణ పూర్తి చేశారు. ఆలయ ప్రధాన రహదారుల్లో విద్యుద్దీపాలతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. 18న ప్రధానాలయ ఉత్తర ప్రాంతంలోని వాయుదిశలో నిర్మించిన లిప్టు, రథశాల ప్రాంతంలో కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం 80 ఫీట్ల పొడవు, 45 ఫీట్ల వెడల్పు విస్తీర్ణంలో ప్రత్యేక కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 11 నుంచి 21వరకు నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలను రద్దు చేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Prints Fake Rs 500 Notes | ఇంటి అద్దె చెల్లించలేక.. నకిలీ రూ.500 నోట్లు ముద్రించిన వ్యక్తి
France Protests | ఫ్రాన్స్‌లో చెలరేగిన హింస.. 1000 మంది అరెస్ట్.. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ల ప్రయోగం
AP News | రానున్న ఐదు రోజులు అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు ఏపీ హోంమంత్రి ఆదేశం..!
CULT Title | సూర్య సినిమా కోసం ‘కల్ట్’ టైటిల్ అడిగారు.. కానీ నేను ఇవ్వలేదు: విశ్వక్ సేన్
Rahul Gandhi | ‘మా ర్యాలీకి పబ్లిసిటీ చేస్తున్నందుకు థ్యాంక్స్’.. బీజేపీపై రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

