యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం స్వస్తీవాచనంతో ఉత్సవాలను అర్చకులు ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ అర్చకులు, ఈవో గీతతో పాటు పలువురు పాల్గొన్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.

అఖండ జ్యోతి శోభాయాత్ర
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్ నుండి బయలుదేరిన అఖండ జ్యోతి శోభాయాత్రలో భువనగిరి పట్టణం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి డిగ్రీ కాలేజ్ వద్ద జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామి వారి శోభాయాత్రను సాగనంపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ బండారు జయశ్రీ, కార్యక్రమ నిర్వాహకులు మంతెన నాగరాజు, సద్ది వెంకట్ రెడ్డి, భక్త జన బృందం పాల్గొన్నారు.

నేటి నుంచి ఈ నెల 14 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ ఉన్నందున బాలాలయంలోనే బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేశారు. 10న ఎదుర్కోలు, 11న తిరుకల్యాణ మహోత్సవం, 12న దివ్యవిమాన రథోత్సవం, 13న మహా పూర్ణాహుతి, చక్రతీర్థం కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ వివాదంపై స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!
Atrial Fibrillation | ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
BRS | కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భార్గవ్ దేశ్‌పాండే
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

