యూరియా అడిగితే పోలీసులను పంపుతరా!
రైతులు యూరియా అడిగితే.. సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులను ఇంటికి పంపుతున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి మండిపడ్డారు. ఆగ్రహంతో ఉన్న తెలంగాణ ప్రజానీకం సీఎంపై తిరుగబడే పరిస్థితులు వచ్చాయని తెలిపారు.
- ప్రశ్నిస్తే మనోభావాలు దెబ్బతింటున్నాయా?
- బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రైతులు యూరియా అడిగితే.. సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులను ఇంటికి పంపుతున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి మండిపడ్డారు. ఆగ్రహంతో ఉన్న తెలంగాణ ప్రజానీకం సీఎంపై తిరుగబడే పరిస్థితులు వచ్చాయని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. యూరియా కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే.. పోలీసుల మనోభావాలు ఎందుకు దెబ్బతింటున్నాయని ప్రశ్నించారు.
కాంగ్రెస్ కోసం ఆ పార్టీ కార్యకర్తల కంటే పోలీసులే ఎక్కువ పని చేస్తున్నారని విమర్శించారు. యూరియా ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించిన రైతుల ఇండ్లకు పోలీసులు ఎందుకు వెళ్తున్నారని, ఎందుకు బెదిరిస్తున్నారని నిలదీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గురువారం యూరియా కొరత గురించి సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించిన రైతుపై పోలీసు అధికారే స్టేషన్లో ఫిర్యాదు చేయడం విడ్డూరమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు తమ అసలు పనులు వదిలేసి, ప్రశ్నించిన ప్రజలను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

