పాత కక్షలతో మహిళ దారుణ హత్య
ఇంట్లో గొడవలతో తండ్రిని చితకబాదుతున్న ఓ వ్యక్తి.. ఎదురుగా కనిపించిన ఓ మహిళపై దాడికి పాల్పడ్డాడు. పాత కక్షలను మనస్సులో పెట్టుకుని ఆమెను దారుణంగా హతమార్చాడు.
కామారెడ్డి రూరల్, జూన్ 18: ఇంట్లో గొడవలతో తండ్రిని చితకబాదుతున్న ఓ వ్యక్తి.. ఎదురుగా కనిపించిన ఓ మహిళపై దాడికి పాల్పడ్డాడు. పాత కక్షలను మనస్సులో పెట్టుకుని ఆమెను దారుణంగా హతమార్చాడు. ఈ ఘట న సోమవారం రాత్రి కామారెడ్డి జిల్లా తిమ్మక్‌పల్లి గ్రామంలో జరిగింది. తిమ్మక్‌పల్లిలో రాగుల లక్ష్మి (80), రాగుల రాజశేఖర్ కుటుంబాలు పక్కపక్కనే నివాసముంటున్నాయి. రెండు కుటుంబాల మధ్య గతంలో గొడవలు జరిగాయి. సోమవారం సాయంత్రం తన తండ్రితో గొడవపడిన రాజశేఖర్.. తండ్రిని చితకబాదుతూ బయటకు లాక్కొచ్చాడు. అదే సమయంలో రోడ్డు మీదుగా వెళ్తున్న లక్ష్మి కనిపించడంతో తండ్రిని వదిలిపెట్టి ఆమెపై దాడికి దిగాడు. ఇటుక పెల్లలు తీసుకుని తలపై, చెవిపై బలంగా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెతో ఉన్న మనువడిపైనా దాడి చేశాడు. ఇది గమనించిన స్థానికులు లక్ష్మిని హుటాహుటిన కామారెడ్డి ఏరియా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో లక్ష్మి మృతి చెందింది. తన తల్లిని చంపిన రాజశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని మృతురాలి కుమారుడు పెద్ద నర్సింహులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉందని దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

