కేసీఆర్ మళ్లీ ఎప్పుడొస్తరు సారూ..
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మద్దూర్ పర్యటనలో ఓ మహిళా రైతు అడిగిన ప్రశ్న ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో హాట్‌టాపిక్ గా మారింది. మంగళవారం ఆయన నారాయణపేట జిల్లా మద్దూర్‌కు వెళ్తూ.. దోరేపల్లిలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యేను చూసిన మహిళా రైతు బుగ్గమ్మ అక్కడికి వచ్చి.. ‘మళ్లీ కేసీఆర్ సారు ఎప్పుడొస్తరు సారూ? ఇంకా ఎన్ని రోజులు ఇలా బతుకాలి?’ అంటూ దీనంగా ప్రశ్నించింది.
- మాజీ ఎమ్మెల్యేను అడిగిన మహిళా రైతు
- రెండేండ్లలో వస్తారన్న పట్నం నరేందర్‌రెడ్డి
- ఇంకా రెండేండ్లా?.. అంటూ రైతు నిట్టూర్పు
- సీఎం నియోజకవర్గంలో ఇదే హాట్ టాపిక్
మద్దూర్, అక్టోబర్ 21 : కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మద్దూర్ పర్యటనలో ఓ మహిళా రైతు అడిగిన ప్రశ్న ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో హాట్‌టాపిక్ గా మారింది. మంగళవారం ఆయన నారాయణపేట జిల్లా మద్దూర్‌కు వెళ్తూ.. దోరేపల్లిలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యేను చూసిన మహిళా రైతు బుగ్గమ్మ అక్కడికి వచ్చి.. ‘మళ్లీ కేసీఆర్ సారు ఎప్పుడొస్తరు సారూ? ఇంకా ఎన్ని రోజులు ఇలా బతుకాలి?’ అంటూ దీనంగా ప్రశ్నించింది.
మరో రెండేండ్లలో కేసీఆర్ సారు మళ్లీ సీఎం అవుతారని, అప్పటి నుంచి మళ్లీ మంచి రోజులొస్తాయని బదులివ్వగా.. ‘ఇంకా రెండేం డ్లా?’ అంటూ బుగ్గమ్మ నిట్టూర్పు విడిచింది. అనంతరం పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల దీనస్థితిని చూసి సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి కొడంగల్ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని, ఎండిపోయిన ప్రతి ఎకరాకూ రూ. 50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

