సింగరేణిలో నెలలోపే వేజ్‌బోర్డు ఎరియర్స్
సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన 23 నెలల 11వ వేజ్‌బోర్డు బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేందుకు ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.1,726 కోట్ల బకాయిలు చెల్లించనున్నామని,
- కార్మికులకు రూ.1,726 కోట్ల చెల్లింపునకు కసరత్తు : డైరెక్టర్ బలరామ్
- ఒక్కో కార్మికుడికి సగటున రూ.4 లక్షలు చెల్లించనున్న సంస్థ
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన 23 నెలల 11వ వేజ్‌బోర్డు బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేందుకు ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.1,726 కోట్ల బకాయిలు చెల్లించనున్నామని, దీంతో ఒక్కో కార్మికుడు సగటున రూ.4 లక్షల వరకు ఎరియర్స్ అందుకుంటాడని సింగరేణి డైరెక్టర్ ఎన్ బలరామ్ శుక్రవారం ప్రకటించారు. కార్మికులకు ఇంత పెద్ద మొత్తంలో బకాయిలను చెల్లించడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారని, ఈ బకాయిలను నెల రోజుల వ్యవధిలో రెండు విడతలుగా కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నామని వెల్లడించారు. పర్సనల్, అకౌంట్స్, ఆడిటింగ్, ఈఆర్పీ, ఎస్ఏపీ, ఐటీ తదితర విభాగాల సమన్వయంతో శుక్రవారం నుంచే వేతన బకాయిల లెకింపు ప్రక్రియను ప్రారంభించినట్టు తెలిపారు. తొలుత వేతన బకాయిలకు సంబంధించిన ఆడిటింగ్‌ను, ఆ తర్వాత మిగిలిన ప్రక్రియలను వేగంగా పూర్తిచేసి చెల్లింపులకు మార్గం సుగమం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్టు వివరించారు.
ముందే చెల్లించేందుకు కృషి
వేతన బకాయిలను నెలరోజుల్లోపే చెల్లించాలని ప్రాథమికంగా అనుకుంటున్నప్పటికీ అంతకన్నా ముందే చెల్లించేందుకు కృషి చేస్తున్నట్టు బలరామ్ తెలిపారు. 11వ వేజ్ బోర్డు సిఫారసులను అందరికన్నా ముందే సింగరేణిలో అమలు జరిపామని, దీంతో సంస్థపై ఏటా దాదాపు రూ.1,200 కోట్ల అదనపు భారం పడుతున్నదని పేర్కొన్నారు. దీనికి రూ.1,726 కోట్ల ఎరియర్స్‌ను కూడా కలిపితే మొత్తం దాదాపు రూ.3 వేల కోట్లు అవుతుందని తెలిపారు. తొలుత ఉద్యోగంలో ఉన్న కార్మికులకు, ఆ తర్వాత పదవీ విరమణ చేసిన కార్మికులకు బకాయిలు చెల్లించనున్నట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

