హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభి వృద్ధి సమాఖ్య సరఫరా చేస్తున్న విజయ పాల ధర పెరిగింది. విజయ పాల ధరను పెంచుతు న్నట్లు విజయ డెయిరీ అధికారులు శుక్రవారం ప్రకటించారు. లీటర్ పాలపై రూ. 2, లీటర్ టోన్డ్ పాలపై రూ. 2, లీటర్ హోల్ మిల్క్‌పై రూ. 4 పెంచారు. పెరిగిన ధరలు జనవరి 1వ తేదీ నుంచి అమలు కానున్నాయి.