తప్పుడు రాతల ‘వెలుగు’
కేసీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కుట్రలు .. 24గంటల్లోగా బీఆర్ఎస్ అధినేతకు యాజమాన్యం క్షమాపణలు చెప్పాల్సిందే..బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
- వెలుగు తప్పుడు కథనాలపై బీఆర్ఎస్ నేతల ఖండన
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తేతెలంగాణ): ‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై వెలుగు దినపత్రికలో తప్పుడు కథనాలు ప్రచురించారు. కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి నీళ్లు తరలించుకుపోతున్నారన్న ఆ కథనంలో ఎలాంటి వాస్తవం లేదు’ అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు. నిరాధారమైన నిందారోపణలు చేసి మహానేత కేసీఆర్ గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించాలని చూడటాన్ని తీవ్రంగా ఖండించారు.
ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న ఒక చానల్, పత్రిక దుష్ప్రచారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్టోబర్ 17న ప్రచురించిన ఆ తప్పుడు కథనాన్ని వెంటనే ఉపసంహరించుకొని కేసీఆర్, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు కోరుతూ 24 గంటల్లోగా తగిన ప్రాధాన్యమిచ్చి వార్తను ప్రచురించాలని, లేనిపక్షంలో పరువునష్టం సహా వర్తించే చట్టాల ప్రకారం న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీ వద్దిరాజు హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

