మన డిగ్రీలోనే అత్యధికంగా 160 క్రెడిట్లు
రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల్లో విద్యాప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్నాయి. డిగ్రీ కోర్సుల్లో అత్యధిక క్రెడిట్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. జాతీయంగా డిగ్రీ కోర్సుకు 120 క్రెడిట్లే ఉండగా, మన దగ్గర 160 క్రెడిట్లు అమలవుతున్నాయి.
- నాలుగేండ్ల డిగ్రీతో సమానం
- జాతీయంగా డిగ్రీకి 120 క్రెడిట్లే
హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల్లో విద్యాప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్నాయి. డిగ్రీ కోర్సుల్లో అత్యధిక క్రెడిట్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. జాతీయంగా డిగ్రీ కోర్సుకు 120 క్రెడిట్లే ఉండగా, మన దగ్గర 160 క్రెడిట్లు అమలవుతున్నాయి. అంటే, మన డిగ్రీ కోర్సుల్లో విద్యాప్రమాణాలు ఎంత పటిష్ఠంగా ఉన్నాయో దీన్నిబట్టి చెప్పొచ్చు. ఇటీవలే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) డిగ్రీ కోర్సుల కరికులం, క్రెడిట్ల ఫ్రేంవర్క్‌ను జారీచేసింది.
మూడేండ్ల డిగ్రీకి 120 క్రెడిట్లు, నాలుగేండ్ల ఆనర్స్ డిగ్రీకి 160 క్రెడిట్లు ఉండాలని నిర్దేశించింది. జాతీయం గా పలు రాష్ర్టాల్లో 120 క్రెడిట్లకే డిగ్రీని జారీచేస్తున్నారు. ఈ లెక్కన తెలంగాణలో అమలవుతున్న డిగ్రీ జాతీయంగా నాలుగేండ్ల ఆనర్స్ డిగ్రీతో సమానం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అధికారులు డిగ్రీలో అనేక సంస్కరణలు చేపట్టారు. రాష్ట్రంలో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం ను (సీబీసీఎస్) అమలుచేస్తున్నారు. వర్తమాన అవసరాలకు తగినట్టుగా కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నారు. విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరుస్తున్నారు. జాతీయస్థాయిలో వి ద్యార్థుల పోటీపడేలా తీర్చిదిద్దేందుకు అత్యధిక క్రెడిట్లను మన దగ్గర అమలుపరుస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maharastra | సీఎం ఫడ్నవీస్ ఇలాకాలో బీజేపీకి షాక్.. నాగ్‌పూర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన.. వెంకీ, త్రివిక్రమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Baththa Out on Netflix | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన సినిమా!
Katrina Kaif | ‘బౌన్స్ బ్యాక్ అవ్వాలా? ఎందుకు?’.. ట్రోలింగ్‌కు కత్రినా కైఫ్ గట్టి సమాధానం!
Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

