24, 26న రెండు అల్పపీడనాలు
ఈశాన్య రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ర్టాల్లో వాతావరణం క్రమంగా మారుతున్నది.
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ఈశాన్య రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ర్టాల్లో వాతావరణం క్రమంగా మారుతున్నది. ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడటం, దక్షిణ కోస్తాంధ్ర నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించడంతో వాతావరణం క్రమంగా మారుతున్నది.
దీంతో ఈ వారంలో బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈనెల 24, 26 తేదీల మధ్య రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రెండు అల్పపీడనాల్లో ఒకటి తుఫానుగా మారే అవకాశముందని భావిస్తున్నది.
దీంతో రాష్ట్రంలో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉం దని అధికారులు వెల్లడించారు. ఉమ్మ డి ఖమ్మం, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మిగతా జిల్లా ల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడవచ్చని పేర్కొన్నది. సాయంత్రం, రాత్రి వేళల్లో వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Food Poisoning | ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం జాగ్రత్తలు పాటించాలి..?
U19 Asia Cup | చివరి బంతి వరకు ఉత్కంఠ.. పాక్పై భారత్ సంచలన విజయం!
AP News | అప్పు తీర్చలేదని తల్లిని, 6 నెలల పసికందును లాక్కెళ్లిన వడ్డీ వ్యాపారులు
‘సింగరేణి సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు’
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

