TSRTC | ఐటీ కారిడార్‌లో రేపటి నుంచి అందుబాటులోకి ‘లేడీస్ స్పెషల్’ బస్సు..! సమయం, రూట్ ఇవే..!
TSRTC | టీఎస్ ఆర్టీసీ మహిళల కోసం సోమవారం నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపనున్నది. ఐటీ కారిడార్‌లో మహిళా ఉద్యోగుల కోసం ‘మెట్రో ఎక్స్‌ప్రెస్ లేడీస్ స్పెషల్’ బస్సును అందుబాటులోకి తీసుకురానున్నది.
TSRTC | టీఎస్ ఆర్టీసీ మహిళల కోసం సోమవారం నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపనున్నది. ఐటీ కారిడార్‌లో మహిళా ఉద్యోగుల కోసం ‘మెట్రో ఎక్స్‌ప్రెస్ లేడీస్ స్పెషల్’ బస్సును అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ బస్సు జేఎన్టీయూ నుంచి వేవ్ రాక్ వరకు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా నడుపనున్నది. హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న ఐటీ కంపెనీల్లో దాదాపు 5లక్షల మంది వరకు మహిళా ఉద్యోగులు పని చేస్తున్నట్లుగా అంచనా. వారి కోసం ప్రత్యేకంగా బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా పెలైట్ ప్రాజెక్టుగా సోమవారం నుంచి బస్‌ను నడుపనున్నది.
ఈ బస్సు జేఎన్టీయూ నుంచి ఉదయం 9.05 గంటల నుంచి బయలుదేరరి బస్సు నెక్సస్ మాల్, హైటెక్ సిటీ, మైండ్‌స్పేస్, రాయదుర్గం, బయో డైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి ఎక్స్‌రోడ్, ఇందిరా నగర్, ఐఐటీ ఎక్స్ రోడ్, విప్రో సర్కిల్, ఐసీఐసీఐ టవర్స్ మీదుగా వెళ్తుంది. తిరిగి సాయంత్రం 5.50 గంటలకు వేవ్ రాక్ నుంచి ఆయా మార్గాల ద్వారా జేఎన్టీయూకు చేరుకుంటుంది. ప్రయోగాత్మకంగా నడుపుతున్న సర్వీసు విజయవంతమైతే మరిన్ని మార్గాల్లో నడిపించాలని ఆర్టీసీ భావిస్తున్నది. కొత్తగా అందుబాటులోకి వస్తున్న ప్రత్యేక బస్సును మహిళా ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

