TSRTC | ఒలెక్ట్రాకకు 550 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్డర్ చేసిన టీఎస్ఆర్టీసీ
TSRTC | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్( Olectra Greentech Limited )కు 550 ఎలక్ట్రిక్ బస్సుల( Electric Bus ) ఆర్డర్ ఇచ్చింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్సిటీ బస్సులను టీఎస్ఆర్టీసీకి సరఫరా చేయనుంది.
దక్షిణాదిలోనే భారీ ఆర్డర్ సొంతం చేసుకున్న ఒలెక్ట్రా
వీటిలో 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సులు
దశల వారీగా పంపిణీ చేయనున్న ఒలెక్ట్రా
త్వరలోనే మొదటి ఆర్డర్ సరఫరా
TSRTC | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్( Olectra Greentech Limited )కు 550 ఎలక్ట్రిక్ బస్సుల( Electric Bus ) ఆర్డర్ ఇచ్చింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్సిటీ బస్సులను టీఎస్ఆర్టీసీకి సరఫరా చేయనుంది. ఈ ఆర్డర్ దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదని ఓజీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ కేవీ. ప్రదీప్ తెలిపారు.
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కి.మీ. ప్రయాణం..
ఎయిర్ కండీషన్డ్ ఇంటర్సిటీ కోచ్ ఎలక్ట్రిక్ బస్సులు మహానగరాలైన హైదరాబాద్, విజయవాడ మధ్య తిరుగుతాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ఇంట్రాసిటీ ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ నగర పరిధిలో తిరుగుతాయి. వీటిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఇవి పర్యావరణానికి తోడ్పటమే కాకుండా, ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా అందిస్తాయి.
రెండేండ్లలో 3,400 ఎలక్ట్రిక్ బస్సులు : బాజిరెడ్డి గోవర్ధన్
ఒలెక్ట్రాకు టీఎస్ఆర్టీసీ ఈ-బస్సుల ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో ఆ సంస్థ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్థన్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా తాము మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని నిర్ణయించాము. వచ్చే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 3,400 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చే యోచనలో ఉన్నామని తెలిపారు.
2025 నాటికి హైదరాబాద్ అంతటా ఎలక్ట్రిక్ బస్సులు : సజ్జనార్
టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ.సజ్జనార్ మాట్లాడుతూ.. మార్చి 2025 నాటికి హైదరాబాద్ అంతటా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ భావిస్తోంది. మొదటిదశలో 550 ఈ-బస్సులను కొనుగోలు చేస్తున్నాము. ఈ బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
సురక్షిత ప్రయాణాన్ని అందించనున్న ఎలక్ట్రిక్ బస్సు : ఒలెక్ట్రా ఎండీ
ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ అందుకున్న నేపథ్యంలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీ నుంచి 550 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ వచ్చింది. వీటిలో స్టాండర్డ్ ఫ్లోర్ 12 మీటర్లున్న.. 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్సిటీ కోచ్ ఈ-బస్సులున్నాయి. స్థిరమైన, ఆర్థికంగా బలమైన, పెద్ద ఎత్తున ప్రజా రవాణా చేసే టీఎస్ఆర్టీసీతో కలిసి పనిచేసే అవకాశం మరోసారి వచ్చినందుకు మేము గర్విస్తున్నాము. ఈ బస్సులను త్వరలో దశలవారీగా పంపిణీ చేస్తాము. ఈ బస్సులు నగరంలో ధ్వని, వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించి ప్రయాణికులకు స్వచ్ఛమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తాయి అని వెల్లడించారు.
టీఎస్ఆర్టీసీతో ఒలెక్ట్రా అనుబంధం 40 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్‌తో మార్చి 2019లోనే ప్రారంభమైందని ప్రదీప్ తెలిపారు. ప్రస్తుతం ఈ బస్సులు విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయన్నారు. నాలుగేళ్ల తర్వాత మరోసారి టీఎస్ఆర్టీసీ.. ఒలెక్ట్రాకు ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చిందని ప్రదీప్ తెలిపారు. ఇవి మెరుగైన పనితీరును అందిస్తూ.. ఫాస్ట్ ఛార్జింగ్‌తో సేవలు అందిస్తాయన్నారు. అధిక ప్రయాణీకుల సామర్థ్యం, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన ఎలక్ట్రిక్ బస్సులు ప్రజారవాణా కోసం అద్భుతమైన ఎంపిక అని ప్రదీప్ పేర్కొన్నారు.
జంటనగరాల్లో ఐదు డిపోలు..
ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, విస్తరణ, కార్యకలాపాల కోసం టీఎస్ఆర్టీసీ జంటనగరాల్లో ఐదు డిపోలను కేటాయించింది. దిల్సుఖ్ నగర్, హయత్‌నగర్, జీడిమెట్ల, మియాపూర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్లలో డిపోలను ఏర్పాటు చేయనుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

