నేడు గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ విడుదల.. ఓఎమ్మార్ షీట్లు కూడా
Group-1 Prelims | రాష్ట్రంలోని గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ నేడు విడుదల కానుంది. కీతోపాటు అభ్యర్థుల ఓఎమ్మార్ షీట్లను అధికారిక వెబ్సైట్లో టీఎస్పీఎస్సీ
హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ నేడు విడుదల కానుంది. కీతోపాటు అభ్యర్థుల ఓఎమ్మార్ షీట్లను అధికారిక వెబ్సైట్లో టీఎస్పీఎస్సీ అందుబాటులో ఉంచనున్నారు. ఐదు రోజులపాటు అభ్యంతరాలకు గడువు ఇవ్వనుంది. ఎలాంటి అభ్యంతరాలు నమోదు కాకుంటే రెండు, మూడు రోజుల్లో ఫైనల్ కీ ని ప్రకటించనుంది. అనంతరం 503 పోస్టుల్లో ఒక్కో ఉద్యోగానికి 50 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. అంటే మొత్తం 25,150 మంది గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు.
మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు ఈ నెల 16న ప్రిలిమినరీ పరీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహించింది. దీనికి 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,86,051 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో టీఎస్పీఎస్సీ తొలిసారి ఒక్కో అభ్యర్థికి ఒక్కో నంబర్ సిరీస్‌తో ప్రశ్నాపత్రం ఇచ్చింది. ప్రశ్నలు అవే ఉన్నప్పటికీ జంబ్లింగ్ పద్ధతిలో జవాబులు అడిగారు. ప్రతిఒక్కరికీ ఒక్కో ‘కీ’ ఇవ్వడం సాధ్యం కానందున మాస్టర్ క్వశ్చన్ పేపర్ ‘కీ’ విడుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులకు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మెయిన్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Group-I
- key
- Prelims
- Recruitment
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | టాప్ ఆర్డర్ వైఫల్యం.. 209 పరుగులకే భారత్ ఆలౌట్!
Jawaharlal Nehru | మాజీ ప్రధాని నెహ్రూతో షర్మిలా, పటౌడీల చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్న సోహా అలీ ఖాన్!
రూ.4.66 లక్షల జరిమానా కడితేనే స్వదేశానికి.. ఆరున్నరేళ్లుగా సౌదీలో చిక్కుకుపోయిన వేములవాడ వాసి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10 నుంచి శ్వేతా నాయుడు ఔట్.. ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లింది ఆమెనేనా?
Vemulawada | వేములవాడ రాజన్న ఆలయ క్యూలైన్ వద్ద అగ్నిప్రమాదం.. భక్తులు లేకపోవడంతో తప్పిన ముప్పు!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

