TS TET | టెట్ ఫలితాలు విడుదల.. పేపర్-2లో 15.30 శాతం ఉత్తీర్ణత
TS TET | తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయు అర్హత పరీక్ష (TS TET) ఫలితాలను బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్ పేపర్-1లో 36.89 శాతం ఉత్తీర్ణత సాధించగా, పేపర్-2లో కేవల 15.30 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది.
TS TET | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయు అర్హత పరీక్ష (TS TET) ఫలితాలను బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్ పేపర్-1లో 36.89 శాతం ఉత్తీర్ణత సాధించగా, పేపర్-2లో కేవల 15.30 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది. పేపర్-2 మ్యాథ్స్, సైన్స్ విభాగంలో 18.66 శాతం, సోషల్ స్టడీస్ విభాగంలో 11.47 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అభ్యర్థులు https://tstet.cgg.gov.in/ అనే అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
టీఎస్ టెట్ పేపర్-1కు 2.26 లక్షల మంది అభ్యర్థులు, పేపర్-2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. పరీక్షలు సెప్టెంబర్ 15న జరుగగా సెప్టెంబర్ 20న టెట్ ప్రాథమిక కీని విడుదల చేశారు. సెప్టెంబర్ 23 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఇవాళ ఫలితాలను వెల్లడించారు.
2022, జూన్‌లో నిర్వహించిన టెట్ పేపర్-1లో 32.68 శాతం, పేపర్-2లో 49.64 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. 2016, మే నెలలో నిర్వహించిన టెట్‌లో పేపర్-1లో 54.45 శాతం, పేపర్-2లో 25.04 శాతం, 2017, జులై నెలలో నిర్వహించిన టెట్ పేపర్-1లో 57.37 శాతం, పేపర్-2లో 19.51 శాతం ఉత్తీర్ణత సాధించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

