ఆర్టీసీ కార్గో.. శంషాబాద్ టు వైజాగ్

- సేవలను మరింత విస్తరించిన రవాణా సంస్థ
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ కార్గో సేవలను మరింత విస్తరిస్తున్నది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా ఏపీలోని విశాఖపట్నం వరకు సేవలను గురువారం ప్రారంభించింది. హైదరాబాద్లో బయలుదేరే కార్గో వాహనాలు కనెక్టెడ్ పాయింట్లు కోదాడ, సూర్యాపేట, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, తుని మీదుగా విశాఖపట్నం చేరుకుంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 10 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ కార్గో వాహనాలు పటాన్చెరు, మెహిదీపట్నం, లక్డీకాపూల్, సీబీఎస్ నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు. వినియోగదారులు తమ వస్తువులను ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ర్టానికి టీఎస్ఆర్టీసీ కార్గోలో పంపేలా ఏర్పాట్లుచేసినట్టు చెప్పారు. ప్రైవేటుతో పోలిస్తే టీఎస్ఆర్టీసీ కార్గో చార్జీలు తక్కువని, వినియోగదారులు తమ సేవలు వినియోగించుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని అధికారులు పేర్కొన్నారు.
డిమాండ్ మేరకు కార్గో సేవలు
వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఆర్టీసీ కార్గో సేవలను అందుబాటులోకి తెస్తున్నాం. ఇల్లు మారుతున్నప్పుడు, గృహనిర్మాణం, పరిశ్రమలకు సంబంధించిన వస్తువులు, ఫర్నిచర్తోపాటు ఇతర సామగ్రిని తరలించేందుకు ఈ ప్రత్యేక కార్గో అందుబాటులోకి తెచ్చాం. సరుకులను అత్యంత వేగంగా చేరవేసేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయి. పూర్తి సమాచారం కోసం https://www. tsrtc.telangana.gov.in వెబ్సైట్ను చూడవచ్చు.
-ఎస్ కృష్ణకాంత్, కార్గో ప్రత్యేక అధికారి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్షిప్స్లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

