TS LAWCET | హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : లా, పీజీ లాసెట్ నోటిఫికేషన్ ఈ నెల 28న విడుదల కానున్న ది. మూడు, ఐదేండ్ల లా, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కు దరఖాస్తులను మార్చి 1 నుంచి ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తారు. లాసెట్ కమిటీ సమావేశం శుక్రవారం హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయం లో నిర్వహించారు.
ఈ సందర్భంగా 2024 -25 విద్యాసంవత్సరానికి లా, పీజీ లాసెట్ షెడ్యూల్‌ను ఖరారు చేసి, విడుదల చేశారు. వివరాలకు www.lawcet.tsche. ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని లాసెట్ కన్వీనర్ బీ విజయలక్ష్మీ సూచించారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ఎస్కే మహమూద్, ఉస్మానియా వీసీ డీ రవీందర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ పాల్గొన్నారు.