TS LAWCET & PGLCET-2024 | జూన్ 3న టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్షలు.. మూడు సెషన్లలో నిర్వహణ
TS LAWCET & PGLCET-2024 | తెలంగాణ లాసెట్, పీజీఎల్ సెట్ (TS LAWCET & PGLCET-2024) పరీక్షలు జూన్ 3న జరగనున్నాయి. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి తరఫున ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షలను నిర్వహిస్తున్నది. జూన్ 3న మొత్తం మూడు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
TS LAWCET & PGLCET-2024 : తెలంగాణ లాసెట్, పీజీఎల్ సెట్ (TS LAWCET & PGLCET-2024) పరీక్షలు జూన్ 3న జరగనున్నాయి. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి తరఫున ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షలను నిర్వహిస్తున్నది. జూన్ 3న మొత్తం మూడు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. రిజిస్టర్ అయిన అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇప్పటికే ప్రకటించారు.
కాగా జూన్ 3న.. సెషన్-1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు, సెషన్-2 పరీక్ష మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు, సెషన్-3 పరీక్ష సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు జరగనుంది. TS LAWCET & PGLCET పరీక్షలు తొలి రెండు సెషన్లలో మొత్తం 68 కేంద్రాల్లో నిర్వహిస్తారు. అందులో 64 కేంద్రాలు తెలంగాణలో, 4 కేంద్రాలు ఏపీలో ఉన్నాయి.
మూడో సెషన్ పరీక్షలను మొత్తం 50 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అందులో 46 కేంద్రాలను తెలంగాణలో, 4 కేంద్రాలను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేశారు. టీఎస్‌లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షల కోసం మొత్తం మొత్తం 50,684 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో టీఆఎస్ లాసెట్ మూడేళ్ల కోర్సు కోసం దరఖాస్తు చేసుకున్న వారు 36,079 మంది, ఐదేళ్ల కోర్సు కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్లు 10,197 మంది, ఎల్ఎల్ఎం పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు 4,408 మంది ఉన్నారు.
ఈ పరీక్షలు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ వెర్షన్లలో రాసుకోవచ్చు. ఈ పరీక్షకు కూడా ఒక నిమిషం నిబంధన వర్తిస్తుంది. కాబట్టి అభ్యర్థులందరూ ఒక గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

