జూన్ 1న ఇంటర్ కాలేజీల రీ ఓపెన్
వచ్చే విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ తరగతులు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. 2023 -24 విద్యాసంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్ శనివారం విడుదల చేశారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 1 నుంచి కాలేజీలు పునఃప్రారంభం కానుండగా, అదేరోజు నుంచి ఇంటర్ కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంకానున్నది.
- అదే రోజు నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం
- ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు తరగతులు షురూ
- 2024 మార్చి మొదటి వారంలో వార్షిక పరీక్షల నిర్వహణ
- ఇంటర్ బోర్డు అకడమిక్ క్యాలెండర్ విడుదల
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): వచ్చే విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ తరగతులు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. 2023 -24 విద్యాసంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్ శనివారం విడుదల చేశారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 1 నుంచి కాలేజీలు పునఃప్రారంభం కానుండగా, అదేరోజు నుంచి ఇంటర్ కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంకానున్నది. మొత్తంగా 227 రోజులపాటు తరగతులు నిర్వహించేలా షెడ్యూల్‌ను విడుదల చేశారు. మొత్తం 227 రోజుల పాటు విద్యాసంవత్సరం కొనసాగేలా షెడ్యూల్ సిద్ధంచేశారు. వార్షిక పరీక్షలను 2024 మార్చిలో నిర్వహించనున్నట్టు అందులో పొందుపరిచారు. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు రెండు నెలల పాటు వేసవి సెలవులు అమల్లో ఉంటాయని.. ప్రైవేట్, అన్ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు విధిగా సెలవులను పాటించాలని నవీన్‌మిట్టల్ ఆదేశించారు. ప్రభుత్వ సెలవులు, ఆదివారాల్లో ఎట్టి పరిస్థితుల్లో తరగతులు నిర్వహించరాదని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాలేజీల్లో అడ్మిషన్లను ఇంటర్‌బోర్డు ప్రకటించే షెడ్యూల్ ప్రకారమే తీసుకోవాలని హెచ్చరించారు.
పరీక్షలు
అర్ధవార్షిక పరీక్షలు 20-11-2023 నుంచి 25-11-2023
ప్రీఫైనల్ ఎగ్జామ్స్ 22-1-2024 నుంచి 29-1-2024
ప్రాక్టికల్ ఎగ్జామ్స్ 2024 ఫిబ్రవరి రెండో వారంలో
ఇంటర్ వార్షిక పరీక్షలు 2024 మార్చి మొదటి వారంలో
అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు 2024 మే చివరి వారంలో
సెలవులు..
దసరా సెలవులు 19-10-2023 నుంచి 25-10- 2023
పునః ప్రారంభం 26 అక్టోబర్ 2023 నుంచి
సంక్రాతి సెలవులు 13-1-2024 నుంచి 16-1-2023
పునః ప్రారంభం 17 జనవరి 2024 నుంచి
వేసవి సెలవులు 1-4-2024 నుంచి 31-5-2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

