TS EAMCET | 24 నుంచి ఎంసెట్ రెండో విడుత కౌన్సెలింగ్.. 31న సీట్ల కేటాయింపు
TS EAMCET | హైదరాబాద్ : ఎంసెట్ ఇంజినీరింగ్ రెండో విడుత కౌన్సెలింగ్ ఈ నెల 24 నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే మొదటి విడుత కౌన్సెలింగ్ పూర్తికాగా, ఈ నెల 16న సీట్లను కేటాయించారు. మొదటి విడుతలో సీట్లు పొందిన విద్యార్థులకు సెల్ఫ్ రిపోర్టింగ్‌కు 23వ తేదీ వరకు అవకాశం కల్పించారు.
TS EAMCET | హైదరాబాద్ : ఎంసెట్ ఇంజినీరింగ్ రెండో విడుత కౌన్సెలింగ్ ఈ నెల 24 నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే మొదటి విడుత కౌన్సెలింగ్ పూర్తికాగా, ఈ నెల 16న సీట్లను కేటాయించారు. మొదటి విడుతలో సీట్లు పొందిన విద్యార్థులకు సెల్ఫ్ రిపోర్టింగ్‌కు 23వ తేదీ వరకు అవకాశం కల్పించారు.
దీంతో ఈ నెల 24 నుంచి రెండో విడుత కౌన్సెలింగ్ ప్రారంభించనున్నారు. విద్యార్థులు ఈ నెల 24, 25 తేదీల్లో ఆన్లైన్లో తమ సమాచారాన్ని పొందుపరిచి, ప్రాసెసింగ్ ఫీజును చెల్లించి, స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఈనెల 26న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. 24 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 27న సీట్లను ఫ్రీజ్ చేయనుండగా, ఈ నెల 31న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన వారు ఈ నెల 31 నుంచి ఆగస్టు 2 వరకు ఆన్లైన్లో సెల్ఫ్‌రిపోర్ట్ చేయడంతో పాటు, ట్యూషన ఫీజు చెల్లించవచ్చు.
మొదటి విడుత కౌన్సెలింగ్‌లో మొత్తం 173 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 82,666 సీట్లుండగా, మొదటి విడుతలోనే 70,665 సీట్లు కేటాయించారు. మరో 12,001 సీట్లు మిగిలి ఉండగా, వీటిని రెండో విడుత కౌన్సిలింగ్లో భర్తీచేస్తారు. అంతేకాకుండా మొదటి విడుతలో సీట్లు పొందిన వారు ట్యూషన్ ఫీజు చెల్లించని పక్షంలో ఆయా సీట్లు రద్దయినట్లుగా భావించి, వాటిని రెండో విడుత కౌన్సెలింగ్‌కు బదిలీ చేస్తారు. దీంతో రెండో విడుతలో కేటాయించే సీట్ల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

