TS Assembly Elections | మేడ్చల్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 19వ రౌండ్ వరకు కౌంటింగ్ పూర్తయ్యింది. బీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డికి 1,69,389 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 1,40,527 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్‌రెడ్డికి 27,290 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి 29,099 ఓట్ల మెజారిటీ దక్కింది. ఇంకా మరో రౌండ్ కౌంటింగ్ కావాల్సి ఉంది.