TS Assembly Elections | తెలంగాణ ఎన్నికల కోసం కర్ణాటక నుంచి నగదు తరలించే యత్నం.. బెంగళూరులో రూ.42 కోట్లు సీజ్ చేసిన ఐటీ అధికారులు
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కర్ణాటక నుంచి భారీగా నగదును తరలించే యత్నాన్ని ఐటీ అధికారులు అడ్డుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కర్ణాటక నుంచి భారీగా నగదును తరలించే యత్నాన్ని ఐటీ అధికారులు అడ్డుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.42 కోట్ల నగదును సీజ్ చేశారు. ఓ లారీలో 22 బాక్సుల్లో రూ.42 కోట్లను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అంతేగాక ఇంతకుముందే మరో రూ.8 కోట్లను కర్ణాటక నుంచి తెలంగాణకు తరలించినట్లు అధికారులు గుర్తించారు.
భారీగా నగదును సీజ్ చేసిన అనంతరం ఐటీ అధికారులు ఈ కేసును ఈడీకి బదిలీ చేశారు. కాగా బెంగళూరు నుంచి బైరే సంద్రకు లారీలో నగదును తరలించి, అక్కడి నుంచి ఏడు కార్లలో తెలంగాణకు తరలించాలని నిందితులు ప్లాన్ చేసినట్లు తెలిపారు. అంతేగాక బెంగళూరులో మరో 5 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేశారు.
కాంట్రాక్టర్ అంబికాపతి ఇల్లు, గెస్ట్‌హౌస్, ఆఫీస్‌లలో తనిఖీలు నిర్వహించారు. తెలంగాణలోని ఓ పార్టీ ఎన్నికల ఖర్చుల కోసం ఈ నగదును తరలిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

