18న ఇందిరాపార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా
Telangana | తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా చేపడుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ మహాధర్నా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం

హైదరాబాద్ : తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా చేపడుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ మహాధర్నా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి తమ డిమాండ్లపై వినతిపత్రం సమర్పిస్తామన్నారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
సంవత్సరానికి ఎఫ్‌సీఐ తీసుకునే ధాన్యం టార్గెట్ వివరాలును రెండు, మూడు రోజుల్లో ఇవ్వాలని కేంద్రానికి రేపు లేఖ రాస్తాను. తమకు సమాధానం కావాలి. పెండింగ్ పెడుతామంటే కుదరదు. తెలంగాణ రైతాంగం తరపున డిమాండ్ చేస్తూ ఈ నెల 18న హైదరాబాద్ మహాధర్నా చేపడుతున్నాం. రాష్ట్ర కేబినెట్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, రైతుబంధు సమితిల జిల్లా అధ్యక్షులతో కలిసి మహాధర్నా చేస్తాం. మిమ్మల్ని వదిలిపెట్టం. రైతులను కాపాడుకునేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులందరూ ప్రజల గొంతుకగా మిమ్మల్ని ప్రశ్నించబోతున్నాం. రేపు మధ్యాహ్నం లోపు మోదీకి, ఆహార శాఖ మంత్రికి లేఖ పంపిస్తాం. కేంద్రం విధానాలను స్పష్టం చేయాలి. బీజేపీ నేతలు రైతులను కన్ఫ్యూజన్ చేయొద్దు.. రైతులను ఆగం చేయొద్దు.
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆగమైన రైతులను అద్భుతంగా కాపాడుకుంటున్నాం. ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. కరోనా టైంలో కూడా ధాన్యం కొనుగోలు చేశాం. తక్షణమే డబ్బులు కూడా పంపిణీ చేశాం. యాసంగి పంటలకు రైతు బంధు డబ్బులు త్వరలోనే ఇస్తాం. యాసంగిలో వరి పంటను వేయొద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ముక్తకంఠంతో ధర్నాలో నిరసన వ్యక్తం చేస్తాం. అప్పటికీ స్పందన లేకపోతే ప్రజలే తేల్చుతారు. ఈ నెల18 తర్వాత కూడా మా పోరాటం కొనసాగుతోంది అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ కామెడీకి ప్రశంసలు, త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
Throat problem | గొంతులో నొప్పి, మంట, గరగర వేధిస్తున్నాయా.. అయితే ఈ వంటింటి చిట్కా మీ కోసమే..!
Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!
Sir Patrick Stewart | హాలీవుడ్లో తీవ్ర విషాదం.. దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ టాస్క్.. నామినేషన్స్‌లో ఆరుగురు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

