చెప్పేవి జోకర్ మాటలు.. చేసేవి బ్రోకర్ పనులు.. రేవంత్‌పై జీవన్‌రెడ్డి ఫైర్
హైదరాబాద్ : టీపీపీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. చెప్పేవి జోకర్ మాటలు.. చేసేవి బ్రోకర్ పనులనీ, ఊరసవెల్లికి వంశోద్ధారకుడివి అంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌ను కనకపు సింహాసనంపై కూర్చున్న శునకంతో పోల్చారు. గురువారం తెలంగాణ గాంధీ, రాష్ట్రం పాలిట దేవుడు సీఎం కేసీఆర్ జన్మదినాన్ని తెలంగాణ ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా జరుపుకున్నారన్నారు. రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొనగా.. కేసీఆర్ పుట్టిన రోజును నిరుద్యోగ దినంగా పాటించాలని సన్నాసి పిలుపునిచ్చాడంటూ మండిపడ్డ ఆయన.. రేవంత్ బర్త్‌డేను నేరస్తుల దినోత్సవంగా ప్రకటించాలని పిలుపునిస్తున్నానన్నారు.
ఊసరవెల్లులే సిగ్గుపడుతున్నయ్
పాలక, ప్రతిపక్షాలు నేతల పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆనవాయితీ అని.. మోదీ, సోనియా సైతం పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోరా? అని ప్రశ్నించారు. పాము తన పిల్లలను తానే తిన్నట్టు రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని మింగిస్తాడన్నారు. అంగీలు, లాగులు మార్చినట్టు పార్టీలు మార్చే రేవంత్‌రెడ్డిని చూసి ఊసరవెల్లులే సిగ్గుపడుతున్నాయన్నారు. మొదట బీజేపీలోకి, తర్వాత టీఆర్ఎస్లోకి జంప్ చేశాడని.. ఆయన చిల్లర బుద్ధులు మా దగ్గర నడవలేదని, దీంతో టీడీపీ పంచన చేశాడని ఆరోపించారు. టీడీపీ దివాలా తీయడంతో ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి పీసీసీ అధ్యక్షుడి పేరుతో గాంధీ భవన్ గాడ్సే అయ్యిందని జీవన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు కండ్లలో ఆనందం చూసేందుకు కేసీఆర్‌ను తిట్టడమే పెట్టుకున్నాడన్నారు. కానిస్టేబుల్ చేతిలో ఉండే లాఠీ అంత లేని.. లూటీవాలాకు కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఉందా? అని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు అయిన రేవంత్.. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై విషం కక్కడం తప్పా ఏనాడైన ప్రజా సమస్యల గురించి మాట్లాడావా? అని నిలదీశారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి
రేవంత్ వచ్చాక తిట్టుకోవడం, నెట్టుకోవడం, కొట్టుకోవడం తప్ప కాంగ్రెస్‌లో ఏందన్నారు. రేవంత్ వృత్తి బ్లాక్ మెయిలింగ్ అనీ, ప్రవృత్తి మనీ గెయినింగ్ అని విమర్శించారు. కేసీఆర్ ఎడమకాలి చెప్పును సైతం తాకే అర్హలేదన్నారు. చట్టవ్యతిరేకంగా పనులు చేస్తే ఎవరినైనా పోలీసులు అదుపులోకి తీసుకుంటారన్నారు. దానికి రేవంత్‌రెడ్డికి మినహాయింపు లేదన్నారు. దసరా, రంజాన్, క్రిస్టమస్లా కేసీఆర్ బర్త్ డేను తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు. తెలంగాణ గాంధీకి వందశాతం గౌరవం ఇవ్వాల్సిందేనని, కేసీఆర్‌ను సంస్కార హీనంగా తిడితే ఎవరినైనా జైలుకు పంపాల్సిందేనన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే ఆగమవుతారని, ఉరికిచ్చి కొడతామని జీవన్‌రెడ్డి హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam CP | అర్ధరాత్రి వేళ బైక్‌పై సీపీ పెట్రోలింగ్.. మంచిర్యాలలో ఆకస్మిక తనిఖీలు
Nivetha Pethuraj | ‘ఆదర్శ కుటుంబం’ కథ మొత్తం తెలియదన్న నివేదా పేతురాజ్.. ట్రోలింగ్ ఎదుర్కొంటున్న బ్యూటీ
Donald Trump | ఏఐ పదాన్ని నిషేధిస్తా : ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
విద్యుత్తు కొనుగోళ్లకు ఆత్రమెందుకు.. ఈఆర్సీకి సీనియర్ జర్నలిస్టు వేణుగోపాల్‌రావు అభ్యంతరాలు
Healthy Foods | చేపలు తినని వారికి గుడ్‌న్యూస్.. ఒమేగా 3 అందించే ఆహారాలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

