దమ్ముంటే విచారణ జరిపించాలి

సీబీఐ కాకపోతే సీబీఐ తాతతోనైనా..
బండి సంజయ్‌కి విప్ బాల్క సుమన్ సవాల్
హైదరాబాద్, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి దమ్ముంటే సీబీఐ కాదు సీబీఐ తాతతోనైనా విచారణ జరిపించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సవాల్ విసిరారు. సింగరేణిలో అవినీతి, అక్రమాలు జరిగాయని మాటిమాటికి బండి సంజయ్ ఆరోపణలు చేయటాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిపై బండి సంజయ్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారన్నారు. సింగరేణి కార్మికుల ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని 2014 జూన్ 14న అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
బీజేపీ నాయకులకు దమ్మూ, ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందాల్సిన అనేక ప్రయోజనాలను కేంద్రం తొక్కిపెడుతుందని, వీటిపై స్పందించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై బట్టకాల్చి మీదేయటం మానుకోవాలని హితవు పలికారు. సింగరేణి లాభాల్లో 28 శాతం వాటాను కార్మికులకు పంచిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత 14 వేల ఉద్యోగాలను సింగరేణిలో కల్పించిన ప్రభుత్వాన్ని అభినందించకపోయినా పర్వాలేదు కానీ.. అసత్యాలు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

