TS Assembly | జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులను అభివృద్ధి చేస్తున్నాం : మంత్రి కేటీఆర్
TS Assembly | నగరంలోని చెరువులను పర్యవేక్షిస్తూ అభివృద్ధి చేస్తున్నాం. చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్, సుందరీకరణ, మురుగు కాల్వల మళ్లింపు చేపట్టామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువులలో 127 చెరువులను అభివృద్ధి పరిచేందుకు

హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో చెరువుల సుందరీకరణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
నగరంలోని చెరువులను పర్యవేక్షిస్తూ అభివృద్ధి చేస్తున్నాం. చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్, సుందరీకరణ, మురుగు కాల్వల మళ్లింపు చేపట్టామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువులలో 127 చెరువులను అభివృద్ధి పరిచేందుకు గుర్తించి, అందులో 48 చెరువులను అభివృద్ధి చేశామన్నారు. చెరువుల అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ. 407 కోట్ల 30 లక్షలను మంజూరు చేశాం. ఇప్పటికే రూ. 218 కోట్లను ఖర్చు చేశామని తెలిపారు. రూ. 94 కోట్ల 17 లక్షల అంచనా వ్యయంతో 63 చెరువుల సుందరీకరణను జీహెచ్ఎంసీ చేపట్టి 48 చెరువుల పనులను పూర్తి చేసింది. మిగతా 15 చెరువుల పనులు పురోగతిలో ఉన్నాయి. రూ. 282 కోట్ల 63 లక్షల అంచనా వ్యయంతో మిషన్ కాకతీయ అర్బన్ కింద 19 చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టామన్నారు. రూ. 30 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో 45 చెరువుల అభివృద్ధి, వరద వల్ల దెబ్బతిన్న మరమ్మతులను జీహెచ్ఎంసీ చేపట్టింది అని కేటీఆర్ తెలిపారు.
దశాబ్దాలుగా చెరువులు కబ్జాకు గురయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో చెరువుల అభివృద్ధికి ఒక డివిజన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి ఒక స్పెషల్ కమిషనర్‌ను నియమిస్తాం. చెరువుల అభివృద్ధి కోసం ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. హైదరాబాద్‌లో వచ్చే రెండేళ్లలో 31 సీవరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. నాలాలపై ప్రత్యేక దృష్టి సారించాం. నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించి, వారికి వెంటనే పునరావాసం కల్పించాలని ఆలోచిస్తున్నాం. నాలాల విస్తరణకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని సంబంధిత మంత్రి, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్ చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ బీమా లక్ష్యం’
‘బాలల హక్కుల పరిరక్షణతోనే బంగారు భవిష్యత్‌కు పునాది’
‘అర్హులు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు దరఖాస్తు చేసుకోవాలి’
భూ భారతి చట్టంపై న్యాయ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన
Siraj | ఆ పేరు కారణంగానే సిరాజ్‌ను సెలెక్ట్ చేయలేదు..! దుమారం రేపుతున్న రాజకీయ విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

