మహిళలు సమర్థవంతంగా రాణించాలి : మంత్రి సబిత
హైదరాబాద్ : మహిళలపై వివక్ష లేని రంగం అంటూ ఏదీ లేదని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని రాణించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్‌షాప్‌లో మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్ ఏర్పాటు చేసిన అల్లం నారాయణను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం మాట్లాడుతూ సమాజంలో సగమై నేడు మహిళలు అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నారని, అత్యంత క్లిష్టమైన జర్నలిజం రంగంలో రాణించడం గొప్ప విషయమన్నారు. అందరి కోసం ఒక వేదిక ఏర్పాటుకు కృషి చేసిన మీడియా అకాడమీని ప్రశంసిస్తూ మీడియా సెంటర్ ఏర్పాటుకు సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అందరూ ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. పురుషులతో సమానంగా సంపాదిస్తున్న అంతా కన్నా ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్న, చేసే పనిని నిబద్ధతతో చేస్తూ రాణిస్తూ ముందుకెళ్తున్నారన్నారు.
రాజకీయాల్లో వచ్చిన మొదట్లో తనను ‘గరిట తిప్పే వాళ్లతో ఏం అవుతుంది’ అన్న మాటలను ఛాలెంజ్‌గా తీసుకొని పని చేసినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ఉద్యమ కాలంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పదని, నేడు పునర్నిర్మాణంలో సైతం పాత్ర అమోఘమని కొనియాడారు. రెండు రోజుల శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని, సీనియర్ పాత్రికేయుల అనుభవాలు తెలుసుకొని, భవిష్యత్‌లో మరింతగా రాణించాలన్నారు. దృష్టికి వచ్చిన పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి’
Srinivas Goud | ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’
Watch: కర్వా చౌత్ రోజున ప్రియుడిని కలిసిన భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
Congress Party | కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలతో సతమతమయ్యాం..కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి : ఐనేని దీపక్ రావు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

