విద్యుదాఘాతంతో ముగ్గురు రైతుల మృతి
విద్యుదాఘాతంతో ముగ్గురు రైతులు మృతి చెందిన ఘటన మెదక్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో చోటుచేసుకున్నది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లికి చెందిన రైతు రాజబోయిన లక్ష్మణ్ (42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం రాత్రి లక్ష్మణ్ పంటకు నీళ్లు పెట్టేందుకు తన పొలం వద్దకు వెళ్లాడు.
కోడేరు/అయిజ/మనోహరాబాద్, అక్టోబర్ 27 : విద్యుదాఘాతంతో ముగ్గురు రైతులు మృతి చెందిన ఘటన మెదక్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో చోటుచేసుకున్నది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లికి చెందిన రైతు రాజబోయిన లక్ష్మణ్ (42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం రాత్రి లక్ష్మణ్ పంటకు నీళ్లు పెట్టేందుకు తన పొలం వద్దకు వెళ్లాడు. బోరుమోటర్‌ను ఆన్‌చేసే క్రమంలో స్టార్టర్‌ను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తుషాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం పర్దీపురం గ్రామానికి చెందిన చిన్న ఈరన్నగౌడ్కు ఇద్దరు కుమార్తెలతోపాటు కొడుకు ఉరుకుందుగౌడ్ (17) సంతానం. ఉరుకుందుగౌడ్ మంగళవారం ఉదయం పొలం వద్ద మిరప పంటకు నీళ్లు పారబెట్టేందుకు వెళ్లాడు. బోరు మోటర్‌ను ఆన్ చేసే క్రమంలో విద్యుత్తుషాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్లు (55) మంగళవారం ఉదయం తన పొలంలో సాగు చేసిన వరి పంటకు నీళ్లు పారించడానికి వెళ్లాడు. కరెంట్ మోటర్‌ను ఆన్ చేస్తుండగా అప్పటికే తెగి పడిన విద్యుత్తు తీగకు తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

