Traffic Alert | నేడు, రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ వైపు వెళ్లారో ఇక అంతే!
లష్కర్ బోనాలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించి మొక్కులు తీర్చుకోవాలని పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో సికింద్రాబాద్‌లో దారులన్నీ బోనాల భక్తులతో నిండిపోయాయి.
Traffic Alert | హైదరాబాద్: లష్కర్ బోనాలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించి మొక్కులు తీర్చుకోవాలని పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో సికింద్రాబాద్‌లో దారులన్నీ బోనాల భక్తులతో నిండిపోయాయి. అదేవిధంగా నేడు, రేపు జరుగునున్న వేడుకలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. ఉజ్జయిని మహంకాళి ఆలయానికి 2 కిలో మీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు.
కర్బాలా మైదాన్, రాణిగంజ్, రామ్‌గోపాల్‌ఫేట్ ఓల్డ్ పీఎస్, పారడైస్, సీటీవో ప్లాజా, ఎస్బీఐ ఎక్స్ రోడ్, వైఎంసీఏ ఎక్స్ రోడ్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, పార్క్‌లేన్, బాటా, బైబిల్ హౌజ్, మినిస్టర్ రోడ్, రసూల్‌పురా వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులను కూడా పోలీసులు అలర్ట్ చేశారు. స్టేషన్లోకి ప్లాట్ ఫాం నంబర్ 1 నుంచి కాకుండా ప్లాట్ ఫాం నంబర్ 10 నుంచి లోపలికి చేరుకోవాలని సూచించారు.
ఈ రోడ్లు మూసివేత..
- టోబాకో బజార్ నుంచి మహంకాళి టెంపుల్‌కు వచ్చే రోడ్
- బాటా ఎక్స్ రోడ్ నుంచి రాంగోపాల్ పేట పీఎస్ వరకు
- జనరల్ బజార్ రోడ్
- ఆదయ్య ఎక్స్ రోడ్
మళ్లింపు మార్గాలు ఇవే..
- సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను చిలకలగూడ ఎక్స్ రోడ్డు మీదుగా గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్ ఎక్స్ రోడ్, కవాడిగూడ, మారియట్ హోటల్ మీదుగా మళ్లించనున్నారు.
- సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే ఆర్టీసీ బస్సులను బేగంపేట నుంచి క్లాక్ టవర్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, ఎస్బీఐ ఎక్స్ రోడ్డు మీదుగా మళ్లించనున్నారు.
- బైబిల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ వచ్చే వాహనాలను సజ్జనాల్ స్ట్రీట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లేదా హిల్ స్ట్రీట్, రాణిగంజ్ మీదుగా మళ్లించనున్నారు.
- ఎస్బీఐ ఎక్స్ రోడ్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను ప్యాట్నీ ఎక్స్ రోడ్, ప్యారడైస్, మినిస్టర్ రోడ్ లేదా క్లాక్ టవర్, సంగీత్ ఎక్స్ రోడ్, సికింద్రాబాద్ స్టేషన్, చిలకలగూడ, ముషీరాబాద్ ఎక్స్ రోడ్, కవాడిగూడ, మారియట్ హోటల్ మీదుగా మళ్లించనున్నారు.
- ప్యారడైస్ నుంచి బైబిల్ హౌస్ వైపు వెళ్లే వాహనాలను ఆర్పీ రోడ్, ఎస్బీఐ ఎక్స్ రోడ్డు లేదా పారడైస్ మీదుగా మళ్లించనున్నారు.
- హకీంపేట్, బోయిన్పల్లి, బాలానగర్, అమీర్‌పేట నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే ఆర్టీసీ బస్సులను క్లాక్ టవర్ వరకే అనుమతించనున్నారు. మళ్లీ ప్యాట్నీ, ఎస్బీఐ ఎక్స్ రోడ్ మీదుగా తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది.
బోనాల జాతరకు వచ్చే వారికి పార్కింగ్ స్థలాలు..
- హరిహర కళా భవన్, మహబూబ్ కాలేజీ, ఓల్డ్ జైల్ ఖానా ఓపెన్ ప్లేస్, ఇస్లామియా హై స్కూల్, గవర్నమెంట్ అదయ్య మెమోరియల్ హై స్కూల్, ఆదయ్య ఎక్స్ రోడ్, రాణిగంజ్, సికింద్రాబాద్, మహాత్మా గాంధీ విగ్రహం, ఎంజీ రోడ్, బెల్సన్ తాజ్ హోటల్, అంజలి థియేటర్, పరేడ్ గ్రౌండ్.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

