కాంగ్రెస్లో కమిటీల కల్లోలం.. పార్టీ అధికార ప్రతినిధి పదవికి బెల్లయ్య నాయక్ రాజీనామా
Bellaiah naik | కాంగ్రెస్లో కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలు కల్లోలం సృష్టిస్తున్నాయి. పీసీసీ కొత్త కమిటీలపై వివాదం రోజురోజుకు ముదురుతున్నది. అంకితభావంతో పార్టీకి సేవచేస్తున్నవారిని కాదని కొత్తగా చేరిన వారికి,
హైదరాబాద్: కాంగ్రెస్లో కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలు కల్లోలం సృష్టిస్తున్నాయి. పీసీసీ కొత్త కమిటీలపై వివాదం రోజురోజుకు ముదురుతున్నది. అంకితభావంతో పార్టీకి సేవచేస్తున్నవారిని కాదని కొత్తగా చేరిన వారికి, జూనియర్లకు ప్రధాన కమిటీల్లో చోటు కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నేత కొండా సురేఖ కొత్తకమిటీలపై అసంతృప్తి వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె బాటలోనే పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్ పయణించారు. తన పదవికి రాజీనామా చేశారు. తనకు కొత్త కమిటీల్లో చోటుకల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇప్పటికే కొండా సురేఖ తనకు స్థానం కల్పించిన ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేశారు. ఎంతో రాజకీయ అనుభవం గల తనకు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చోటు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కాకుండా ఎగ్జిక్యూటివ్ కమిటీలో తనకు స్థానం కల్పించడమేంటని ప్రశ్నించారు. ఇది తనను అవమానించడమేనన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో తనకు స్థానం అవసరం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

