హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : లా, పీజీలాసెట్ నోటిఫికేషన్ బుధవారం విడుదలకానున్నది. ఈ నెల 1 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 15 వరకు, ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించారు. లాసెట్‌కు దరఖాస్తు చేసేవారు రూ.900, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.600, పీజీలాసెట్ (ఎల్ఎల్ఎం)కు రూ.1,100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 900 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలని కన్వీనర్ విజయలక్ష్మీ తెలిపారు.
లాసెట్, పీజీ లాసెట్ షెడ్యూల్ వివరాలిలా
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ : 01-03-2024
దరఖాస్తులకు తుది గడువు : 15-04-2024
దరఖాస్తుల సవరణ : 20-05-2024 నుంచి 25-05-2024
హాల్‌టికెట్ల డౌన్లోడింగ్ : 30-05-2024
పరీక్షాతేదీ : 03-06-2024
ప్రాథమిక కీ విడుదల : 06-06-2024
కీపై అభ్యంతరాల స్వీకరణ : 07-06-2024