హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో టైగర్ సఫారీ అక్టోబర్ 4 నుంచి తిరిగి ప్రారంభం కానున్నది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు పులుల సంతానోత్పత్తికి అనుకూలమైన సీజన్ కా వడంతో నల్లమల ఫారెస్ట్ ట్రాక్‌లో సందర్శకుల సంచారాన్ని నిలిపి వేసినట్టు అమ్రాబాద్ ఫారెస్ట్ అధికారులు తెలిపారు.