సాధువులను ఢీకొట్టిన డీసీఎం వాహనం
పాదయాత్రగా వెళ్తున్న సాధువులపైకి డీసీఎం వాహనం దూసుకెళ్లడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం వద్ద ఎన్‌హెచ్-44పై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది.
- ముగ్గురు జైనమత ప్రచారకుల దుర్మరణం
- మరో ఇద్దరికి తీవ్రగాయాలు
- వనపర్తి జిల్లా రంగాపురం వద్ద ఘటన
పెబ్బేరు, జూన్ 9 : పాదయాత్రగా వెళ్తున్న సాధువులపైకి డీసీఎం వాహనం దూసుకెళ్లడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం వద్ద ఎన్‌హెచ్-44పై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. ఎస్సై హరిప్రసాద్‌రెడ్డి కథనం మేరకు.. గుజరాత్‌కు చెందిన కొందరు సాధువులు జైన మత ప్రచారం కోసం ఈ నెల 3న హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు పాదయాత్రగా బయలుదేరారు. శనివారం రాత్రి రంగాపురంలోని ప్రభుత్వ పాఠశాలలో బస చేసి తెల్లవారుజామున తిరిగి పయనమయ్యారు.
కాసేపటికే హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం అతివేగంగా సాధువుల పైకి దూసుకొచ్చి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పునీత్ మహరాజ్ (50), భగవాన్భాయ్ (36), హేమల్ ప్రవీణ్షా (52) మృతి చెందారు. మరో ఇద్దరు విజ్ఞాన్ ప్రజ్ఞ సూరజ్ మహరాజ్, ప్రియాంకర్ మహరాజ్ తీవ్రంగా గాయపడగా.. గద్వాల దవాఖానకు తరలించారు.
ఇందులో గురువు విజ్ఞాన్ ప్రజ్ఞ సూరజ్ మహరాజ్ వృద్ధాప్యం కారణంగా వీల్‌చైర్‌లో యాత్ర కొనసాగిస్తుండగా.. భగవాన్భాయ్, హేమల్ ప్రవీణ్షా తోస్తుండగా ప్రమాదం జరిగింది. డీసీఎంలో డ్రైవర్ నరేశ్, క్లీనర్ హరీశ్ ఉన్నారు. విషయం తెలుసుకున్న విజ్ఞాన్ ప్రజ్ఞ సూరజ్ మహరాజ్ శిష్యుడు, కర్నూల్‌కు చెందిన బట్టల వ్యాపారి అశోక్‌కుమార్ జైన్ ఘటనా స్థలానికి చేరుకొని ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Accident
- dcm vehicle
- Pilgrims
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

