చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు ఓ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. మృతులు పారిశ్రామిక వాడలోని ఓ కంపెనీలో పనిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామన్నారు.