Heart Attack | గుండెపోటుతో మూడోతరగతి విద్యార్థి మృతి.. జగిత్యాలలో విషాదం
Heart Attack | అప్పటిదాకా దైవ సన్నిధిలో కుటుంబ సభ్యులతో గడిపిన మూడోతరగతి విద్యార్థి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో జరిగింది.
Heart Attack | జగిత్యాల రూరల్, ఏప్రిల్ 7 : అప్పటిదాకా దైవ సన్నిధిలో కుటుంబ సభ్యులతో గడిపిన మూడోతరగతి విద్యార్థి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తోపారపు చంద్రశేఖర్-నవిత దంపతుల కుమారుడు నిశాంత్ (9) గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు.
మంగళవారం గ్రామ శివారులోని శివాలయంలో అన్నదాన కార్యక్రమానికి కుటుంబంతో కలిసివెళ్లాడు. అప్పటిదాకా కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపిన నిశాంత్ తోటి పిల్లలతో ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం జగిత్యాల దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

