పత్తి విత్తనాల కొరత
వానకాలం సీజన్ ఆరంభంలోనే పత్తి విత్తనాల కొరత ఏర్పడింది. అప్పుడే ఆదిలాబాద్ జిల్లాలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పత్తి విత్తనాలు లేవంటూ దకాణదారులు తెగేసి చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
- సీజన్ ఆరంభంలోనే రైతుల ఆందోళన
- ఆదిలాబాద్‌లో నో స్టాక్ బోర్డులు
- బ్లాక్‌లో అమ్ముతున్నారంటూ ఆగ్రహం
- సరఫరా లేదంటున్న వ్యాపారులు
ఆదిలాబాద్, మే 20(నమస్తే తెలంగాణ) : వానకాలం సీజన్ ఆరంభంలోనే పత్తి విత్తనాల కొరత ఏర్పడింది. అప్పుడే ఆదిలాబాద్ జిల్లాలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పత్తి విత్తనాలు లేవంటూ దకాణదారులు తెగేసి చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు సకాలంలో కురుస్తుండటంతో రైతులు దుక్కులు దున్ని విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి సాగు చేస్తారు. సోమవారం జిల్లాలోని రైతులు విత్తన దుకాణాలకు వచ్చి ఆర్సీహెచ్ 659 పత్తి విత్తనాలు కావాలని అడిగారు. ఆ రకం విత్తనాలు లేవని దుకాణదారులు చెప్పడంతో వారంతా రైతులు ఆందోళన చేపట్టారు. పలు దుకాణాల్లో నో స్టాక్ బోర్డులు కూడా పెట్టడం చూసి కంగుతిన్నారు. విత్తనాల కోసం మూడు, నాలుగు రోజుల నుంచి వస్తున్నా దుకాణాల్లో ఆర్సీహెచ్ 659 విత్తనాలు దొరకడం లేదని, విత్తనాల సరఫరాలో అధికారులు విఫలమయ్యారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణాదారులు విత్తనాలను బ్లాక్‌లో ఎక్కువ ధరలకు అమ్ముతున్నారంటూ ధ్వజమెత్తారు. కంపెనీ నుంచి విత్తనాల సరఫరా లేకపోవడంతో తాము రైతులకు ఇవ్వలేకబోతున్నామని వ్యాపారులు పేర్కొంటున్నారు. వేరే కంపెనీల పత్తి విత్తనాలు అవసరం లేదని, ప్రభుత్వం స్పందించి విత్తనాలు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
బ్లాక్‌లో అమ్ముతున్నారు
ఆర్సీహెచ్ 659 పత్తి విత్తనాల కోసం రెండు, మూడు సార్లు ఆదిలాబాద్‌కు వచ్చి దుకాణాల్లో అడిగితే స్టాక్ లేదని చెప్తున్నారు. ఒక ప్యాకెట్ ధర రూ.860 అంటున్నారు. వ్యాపారులు బ్లాక్‌లో ఎక్కువ ధరకు అమ్ముకొంటున్నారు. అధికారులే స్వయంగా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి.
– దిగంబర్ రైతు,కొద్దూర్, బేల మండలం.
నష్టపోతే ఎవరిది బాధ్యత
నాకు 12 ఎకరాలున్నది. వానకాలంలో పత్తి సాగు చేస్తా. ఆర్సీహెచ్ విత్తనాలను వేస్తే పత్తి పంట మంచిగా వస్తుందనే నమ్మకం. ఇప్పటికే పత్తి విత్తనాలు కోసం మూడు సార్లు వచ్చినా స్టాక్ లేదని దుకాణదారులు చెప్తున్నారు. వేరే విత్తనాల వల్ల నష్టపోతే ఎవరిది బాధ్యత.
– గణేశ్, రైతు,కాంగర్పూర్, బేల మండలం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

