సోమేశ్వరాలయ శిల్పకళ అద్భుతం
నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ పచ్చల సోమేశ్వరాలయం అద్భుత శిల్పకళకు అద్దం పడుతున్నదని డెక్కన్ హెరిటేజ్ ఫాండేషన్(డీహెచ్ఎఫ్) సహ వ్యవస్థాపకుడు హెలెన్ ఫిలాన్ అన్నారు.
- దక్కన్ హెరిటేజ్ ఫాండేషన్ సహ వ్యవస్థాపకుడు హెలెన్ ఫిలాన్
- వివరించిన ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో శివనాగిరెడ్డి
రామగిరి, జనవరి 16 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ పచ్చల సోమేశ్వరాలయం అద్భుత శిల్పకళకు అద్దం పడుతున్నదని డెక్కన్ హెరిటేజ్ ఫాండేషన్(డీహెచ్ఎఫ్) సహ వ్యవస్థాపకుడు హెలెన్ ఫిలాన్ అన్నారు. సోమవారం నల్లగొండలోని పానగల్ పచ్చల సోమేశ్వరాలయం, దానికి అనుబంధంగా ఉన్న మ్యూజియాన్ని హెలెన్తోపాటు అమెరికాలోని పలు ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది సభ్యుల బృందం సందర్శించింది. వారికి తెలంగాణ ప్రముఖ చరిత్రకారుడు, ప్లీచ్ ఇండియా ఫాండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పచ్చల సోమేశ్వరాలయం, అందులోని కళావైభవాలు, 11, 13వ శతాబ్దాల మధ్య ఇక్కడ పరిపాలన చేసిన కళ్యాణి చాళుక్యులు, కాకతీయుల ఆస్థానంలో ఉన్న కందూరు చోళుల చరిత్రను వివరించారు. అనంతరం ఛాయా సోమేశ్వరాలయాన్ని సందర్శించారు. కార్యక్రమంలో శరత్చంద్ర, ప్రొఫెసర్ మోలీ ఐట్కెన్, సిటీ కాలేజ్ ఆఫ్ న్యూయార్క్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

