Vice Chancellors | వీసీల నియామకానికి నేడు నోటిఫికేషన్.. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ..!
Vice Chancellors | రాష్ట్రంలోని వర్సిటీలకు నూతన వైస్చాన్స్లర్ల (వీసీ) నియామకానికి బుధవారం నోటిఫికేషన్ విడుదలకానున్నది. ఒకవేళ వీలుపడని పక్షంలో ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సంతకం చేశారు. వెంటనే ఈ ఫైల్ విద్యాశాఖకు చేరింది. ఈ నేపథ్యంలో బుధవారం నోటిఫికేషన్ జారీకి విద్యాశాఖ వర్గాలు కసరత్తును తీవ్రతరం చేశాయి.
- ఆ తర్వాత సెర్చ్ కమిటీల నియామకం
- ప్రభుత్వ కసరత్తు ముమ్మరం
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని వర్సిటీలకు నూతన వైస్చాన్స్లర్ల (వీసీ) నియామకానికి బుధవారం నోటిఫికేషన్ విడుదలకానున్నది. ఒకవేళ వీలుపడని పక్షంలో ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సంతకం చేశారు. వెంటనే ఈ ఫైల్ విద్యాశాఖకు చేరింది. ఈ నేపథ్యంలో బుధవారం నోటిఫికేషన్ జారీకి విద్యాశాఖ వర్గాలు కసరత్తును తీవ్రతరం చేశాయి. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. తర్వాత దరఖాస్తులను పరిశీలిస్తారు. సవ్యంగా ఉన్న దరఖాస్తులను సెర్చ్ కమిటీకి పంపిస్తారు. సెర్చ్ కమిటీ ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లను ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గవర్నర్‌కు పంపిస్తుంది. గవర్నర్ ఆమోదించిన తర్వాత ప్రభుత్వం వీసీలను నియమిస్తూ జీవో జారీచేస్తుంది. ఈ ప్రక్రియంతా మే మాసంలోపే పూర్తిచేసి, పాత వీసీలు వైదొలగగానే కొత్త వీసీలు బాధ్యతలు చేపట్టడం లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తును తీవ్రతరం చేసింది.
మేతో ముగియనున్న గడువు
రాష్ట్రంలోని వర్సిటీల్లో బీఆర్ అంబేద్కర్, ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన, పొట్టి శ్రీరాములు తెలుగు, మహాత్మాగాంధీ, జేఎన్టీయూ, జేఎన్ఎఫ్ఏయూ వర్సిటీల వీసీల పదవీ కాలం ఈ ఏడాది మే నెలతో ముగుస్తుంది. ఇక అగ్రికల్చర్ వర్సిటీ వీసీ పదవీ కాలం ముగియగా, ప్రస్తుతం ఇన్చార్జ్ వీసీ కొసాగుతున్నారు. ఇక హార్టికల్చర్, వెటర్నరీ వర్సిటీ వీసీల కాలపరిమితి జనవరితో ముగియనున్నది. బాసర ఆర్జీయూకేటీకి ఇన్చార్జీ వీసీ కొనసాగుతున్నారు. ఇక తెలంగాణ వర్సిటీ వీసీ ఏసీబీకి రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుబడటంతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఇన్చార్జీ వీసీగా వ్యవహరిస్తున్నారు. అటవీ విశ్వవిద్యాలయం, మహిళా వర్సిటీలు ఇటీవలే ఏర్పడటంతో వీటికి కొత్తగా వీసీలను నియమించాల్సి ఉండగా, ఈ రెండింటికి సెర్చ్ కమిటీతో నిమిత్తం లేకుండానే వీసీలను నియమించే వెసులుబాటు ఉన్నది.
సెర్చ్ కమిటీ స్వరూపమిలా..
వీసీల ఎంపిక ప్రక్రియను సెర్చ్ కమిటీలు చేపడుతాయి. యూజీసీ నిబంధనల ప్రకారం ఒక్కో వర్సిటీకి ముగ్గురితో సెర్చ్ కమిటీ ఏర్పడుతుంది. వీటిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీచేస్తుంది. ప్రభుత్వ నామిని, యూజీసీ చైర్మన్ నామిని, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) నామినీలతో ఈ సెర్చ్ కమిటీ ఏర్పడుతుంది. ఈ కమిటీ సమావేశమై అందరి బయోడేటాలను పరిశీలించి, ముగ్గురు పేర్లను వీసీగా నియమించేందుకు సూచిస్తారు. కనీసం ప్రొఫెసర్ 10 ఏండ్లుగా పనిచేసి ఉండాలి. లేదా పరిశోధన, అకడమిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పదేండ్ల అనుభవం కలిగి ఉండాలి. వీసీని మూడేండ్ల కాల పరిమితికి నియమిస్తారు. కాల పరిమితి ముగియగానే వైదొలగాల్సి ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

