నేటితో ఎన్నికల ప్రచారానికి తెర
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగియనున్నది. నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారపర్వాన్ని ముగించాల్సి ఉండటంతో రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం 4 గంటలకు, మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనున్నది.
- హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ పూర్తి
- 35,809 పోలింగ్ కేంద్రాలు
- తది దశకు చేరిన ఎన్నికల ఏర్పాట్లు
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగియనున్నది. నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారపర్వాన్ని ముగించాల్సి ఉండటంతో రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం 4 గంటలకు, మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనున్నది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్, సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో శనివారం సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగుస్తుంది.
రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా హోం ఓటింగ్ ముగిసింది. హోం ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న 23,247 దివ్యాంగులతోపాటు 85 సంవత్సరాల వయసు పైబడిన వారికి ఇంటి వద్దే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించడంతో 21,651 మంది ఓట్లు వేశారు. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సదుపాయాన్ని కల్పించడంతో 2,29,072 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,75,994 మంది ఓటు వేశారు. ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ (ఈడీసీ) ద్వారా 34,973 మంది ఉద్యోగులు పోలింగ్ రోజున ఓటు వేయనున్నారు.
లక్షకుపైగా ఈవీఎంలు
13న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగుతుంది. రాష్ట్రంలోని మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్ల కోసం 35,809 పోలింగ్ కేంద్రాల్లో 1,09,941 బ్యాలెట్ యూనిట్లు, 50,135 వీవీప్యాట్లు, 44,906 కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 50 మంది మహిళలు సహా మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

