సమగ్ర శిక్షలో బదిలీల లొల్లి
సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టులో తాజా బదిలీలు కలకలం రేపుతున్నాయి. షెడ్యూల్ ప్రకటించకుం డా, దరఖాస్తులను స్వీకరించకుండా దొడ్డిదారిన బదిలీలు చేపట్టారనే ఆరోపణలున్నాయి.
- నో షెడ్యూల్ .. నో అప్లికేషన్స్
- దొడ్డిదారిన 52 మందికి స్థానచలనం
- రాత్రికి రాత్రే ఎస్పీడీ పేరుతో ఉత్తర్వులు
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టులో తాజా బదిలీలు కలకలం రేపుతున్నాయి. షెడ్యూల్ ప్రకటించకుం డా, దరఖాస్తులను స్వీకరించకుండా దొడ్డిదారిన బదిలీలు చేపట్టారనే ఆరోపణలున్నాయి. 52 మందిని రాత్రికి రాత్రే బదిలీ చేస్తూ ఎస్పీడీ పేరిట ఉత్త ర్వు జారీ అయిందని సిబ్బంది తెలిపారు. సమగ్ర శిక్ష స్టేట్ పరిధిలో ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్‌పర్సన్స్ (ఐఈఆర్‌ఎస్), మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సి స్టమ్ కో ఆర్డినేటర్ల (ఎంఐఎస్) బదిలీ వెనుక పెద్దతతంగం నడిచినట్టు ఆరోపణలున్నాయి.
ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న పలువురు కుటుంబ అవసరాలరీత్యా బదిలీల కోసం తొమ్మిదేండ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారు. కొత్తగా వివాహమైన వారు, భర్త/భార్య ఇతర జిల్లా ల్లో పనిచేస్తున్న వారు అంతర్జిల్లా బదిలీలు కల్పించాలని ప్రాజెక్టు డైరెక్టర్‌ను కోరుతూ వస్తున్నారు. అనూహ్యంగా 52 మందిని శనివారం రాత్రి బదిలీ చేయడంపై అభ్యర్థులు నిలదీశా రు. గతంలో ఆన్లైన్ విధానంలో చేసినప్పుడు అంతర్ జిల్లా బదిలీలను ఒప్పుకోలేద ని గుర్తుచేశారు. బదిలీల వ్యవహారంపై విచారణ జరిపించాలని, అర్హులకు న్యాయం చేయాలని విజ్ఞప్తిచేశారు.
మరికొన్ని వార్తలు చదవండి..
మిగిలిన పోస్టులకు కౌన్సెలింగ్ పెట్టాలి
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): కొందరు టీచర్లు ఎకువ సబ్జెక్టుల్లో అర్హత ఉండి ఒకే సబ్జెక్టుల్లో పదోన్నతి పొందగా, మిగిలిన 600కుపైగా పోస్టులకు ప్రత్యేక ప్రమోషన్ కౌన్సెలింగ్ నిర్వహించి ఎస్జీటీలకు న్యాయం చేయాలని పీఆర్టీయూ కోరింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్ భిక్షంగౌడ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్జీటీల వెబ్ఆప్షన్లలో ఒకొకరు 1000, 2000 వరకు ఆప్షన్ ఇచ్చుకోవడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. రోజుకు 500 చొప్పున మూడురోజులపాటు బదిలీ కౌన్సెలింగ్ చేపట్టాలని విజ్ఞప్తిచేశారు.
సీజీఎల్ ఉద్యోగాలపై నేడు టీ-సాట్ లైవ్
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ భర్తీ చేసే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఉద్యోగాల అభ్యర్థులకు ఆదివారం మ ధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వర కు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని టీ-సాట్ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. సీజీఎల్ అభ్యర్థులకు, అధ్యాపకులతో ఫోన్ ఇన్ నిర్వహిస్తామని శనివారం పేర్కొన్నారు. సందేహా ల నివృత్తికి 040 23556037, 040 23540726 టోల్ ఫ్రీ, 1800 425 4039 ఫోన్ నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- IERS
- MIS
- Samagra Shiksha
- Transfers
RELATED ARTICLES
తాజా వార్తలు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
అప్పీలులో దాఖలుకు 250 రోజులా?.. రాష్ట్ర సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు.. విద్యాశాఖకు 25 వేలు జరిమానా
తుకుగూడలో కొత్త తెలుగు శాసనం
గౌడ, ఎస్సీల సాంఘిక బహిషరణ దారుణం
12న మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం.. ఎల్ నినో ఎఫెక్ట్, వర్షాభావ పరిస్థితులపై చర్చించే అవకాశం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

