వీసీలను నియమించినా.. ఈసీలను మరిచారు
రాష్ట్రంలోని ఉస్మానియా, పాలమూరు, మహాత్మాగాంధీ, జేఎన్టీయూ తదితర యూనివర్సిటీలకు నిరుడు వైస్చాన్సలర్లను నియమించిన ప్రభుత్వం.. పాలక మండళ్ల (ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల)ను మాత్రం ఇంకా నియమించలేదు. దీంతో దాదాపు 10 వర్సిటీలకు నిరుడు ఏప్రిల్ నుంచి పాలక మండళ్లు లేక పాలన కుంటుపడుతున్నది.
- విశ్వవిద్యాలయాల్లో కీలక నిర్ణయాలు పెండింగ్
- వర్సిటీల అభివృద్ధి, అకడమిక్ అంశాలపై ప్రభావం
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉస్మానియా, పాలమూరు, మహాత్మాగాంధీ, జేఎన్టీయూ తదితర యూనివర్సిటీలకు నిరుడు వైస్చాన్సలర్లను నియమించిన ప్రభుత్వం.. పాలక మండళ్ల (ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల)ను మాత్రం ఇంకా నియమించలేదు. దీంతో దాదాపు 10 వర్సిటీలకు నిరుడు ఏప్రిల్ నుంచి పాలక మండళ్లు లేక పాలన కుంటుపడుతున్నది. వాటిలో పలు కీలక నిర్ణయాలు ఆగిపోతున్నాయి. నిధుల సమీకరణ జరుగక ఆయా వర్సిటీల అభివృద్ధికి విఘాతం కలగడంతోపాటు అడకమిక్ అంశాలపైనా తీవ్ర ప్రభావం పడుతున్నది. దీనిపై ప్రభుత్వ పెద్దలు, ఉన్నత విద్యాశాఖ అధికారులెవరూ నోరు మెదపడం లేదు. దీన్ని బట్టి కాంగ్రెస్ సర్కారుకు విశ్వవిద్యాలయాలు, వాటిలోని విద్యార్థుల బాగోగులు ఏమాత్రం పట్టడం లేదని స్పష్టమవుతున్నది.
ఈసీల ప్రాముఖ్యత ఇదీ..
వర్సిటీల అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకునేందుకు ప్రముఖ వ్యక్తులు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులను ఈసీ సభ్యులుగా నియమిస్తారు. వారి ఆధ్వర్యంలోనే కీలక నిర్ణయాలు, ఆమోదాలు జరుగుతాయి. వర్సిటీ బడ్జెట్, వార్షిక ఖాతాలను ఆమోదించేది, విచ్చలవిడి ఖర్చులను నియంత్రించేది ఈసీయే. ముఖ్య కార్యనిర్వహణ అధికారిలా పనిచేసే ఈసీ.. వర్సిటీల్లో కీలక నిర్ణయాల అమలుకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తుంది.
విధానపరమైన అంశాలపై లోతుగా చర్చిస్తుంది. నియామకాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. నాణ్యమైన విద్యా ప్రమాణాలు పాటించేలా చూస్తుంది. ఏమైనా పొరపాట్లు జరిగితే హెచ్చరిస్తుంది. తప్పు చేసిన వారిని శిక్షించే అధికారం కూడా ఈసీకి ఉంటుంది. ఈసీ ఆమోదం లేకుండా జరిగే నిర్ణయాలు చెల్లవు. ఒక వేళ్ల ముందుస్తుగా ఏ నిర్ణయాలు తీసుకున్నా వా టికి చట్టబద్ధత ఉండదు. ఆ నిర్ణయాలను తర్వాత ఏర్పాటైన ఈసీ సమావేశంలో ఆమోదింపజేసుకోవాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

