హైదరాబాద్, ఏప్రిల్ 20 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): జగిత్యాలలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు జాతీయ మీడియాలోనూ కవరేజీ లభించింది. ఇంగ్లిష్ ప్రధాన న్యూస్ వెబ్సైట్లు కేసీఆర్ ప్రసంగాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. పలు టీవీ చానల్స్ కూడా సభకు సంబంధించిన వివరాలు, వీడియోలను ప్రసారం చేశాయి. మొత్తంగా బీఆర్ఎస్ సభ విజయవంతమైందంటూ తమ కథనాల్లో పేర్కొన్నాయి.
‘కేసీఆర్ ఎనౌన్సెస్ జీవన్‌రెడ్డి యాజ్ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, టార్గెట్స్ కాంగ్రెస్ ఎట్ జగిత్యాల ర్యాలీ’ అనే శీర్షికతో యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా వార్తను ప్రచురించగా, ‘కేసీఆర్ అప్పీయరెన్స్ ఎట్ జగిత్యాల మీటింగ్..’ పేరిట ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మరో కథనాన్ని ప్రచురించింది. ‘కేసీఆర్ వెల్కమ్స్ జీవన్‌రెడ్డి ఇన్‌టూ బీఆర్ఎస్’ అంటూ పేర్కొన్న సియాసత్ డైలీ.. బీఆర్ఎస్ సభ విజయవంతమైనట్టు వెల్లడించింది.