Dead body | హన్మకొండలో కారులో దొరికిన మృతదేహం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సెంటినరీ కాలనీకి చెందిన మానస అనే యువతిగా గుర్తించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు మృతదేహాన్ని గుర్తించి విచారణ చేపట్టారు. వినోద్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి కారు అద్దెకు తీసుకున్నట్లు గురించించి అతడిని విచారించారు. కరీంనగర్లోని గదిలో ఉన్న సమయంలో మానసకు ఫిట్స్ వచ్చి మృతి చెందిందని, భయంతో మృతదేహాన్ని కారులో వదిలి వెళ్లినట్లు పోలీసులకు వినోద్ తెలిపినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, హన్మకొండ జిల్లాలో కారులో డెడ్ బాడీ కలకలం రేపింది. ఎల్కతుర్తి మండల కేంద్రంలో కారు (TS 03 FF 8094) డిక్కీలో గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని వ్యక్తులు గత రెండు రోజులుగా అక్కడే కారును వదిలేసి వెళ్లారు. కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించి విచారణ చేపట్టారు.