Burns crop | నీళ్లు లేక కరెంట్ రాక.. సూర్యాపేట జిల్లాలో పంటను కాలబెట్టిన కౌలు రైతు
అన్నదాతలు అప్పులు చేసి సాగు చేస్తే సరిపడా నీళ్లు, కరెంట్ అందక పంటలు చేతికొచ్చే సమయంలో ఎండిపోతుండటంతో కలత చెందిన రైతన్నలు కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలకు నిప్పు పెట్టడం రాష్ట్రంలో రైతుల పరిస్థితికి అద్దం పడుతున్నది.
సూర్యాపేట : తెలంగాణలో సాగు దుర్భరంగా మారింది. అన్నదాతలు అప్పులు చేసి సాగు చేస్తే సరిపడా నీళ్లు, కరెంట్ అందక పంటలు చేతికొచ్చే సమయంలో ఎండిపోతుండటంతో కలత చెందిన రైతన్నలు కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలకు నిప్పు పెట్టడం రాష్ట్రంలో రైతుల పరిస్థితికి అద్దం పడుతున్నది. తాజాగా సూర్యాపేట జిల్లాలో మరో రైతు పంటకు నిప్పు పెట్టాడు. కౌలుకు తీసుకున్న నాలుగెకరాలలో మూడెకరాలు ఎండిపోవడంతో తీవ్ర ఆవేదన చెందిన రైతు పంటకు నిప్పు పెట్టాడు.
వివరాల్లోకి వెళ్తే..సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలో యాతాకుల మల్లయ్య అనే రైతు తాను కౌలుకు చేస్తున్న నాలుగెకరాల పంట చేతికి వచ్చే సమయంలో కరెంట్, నీళ్లు సరిగా అందక మూడెకరాల పంట ఎండిపోయింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన సదరు రైతు పంటకు నిప్పంటించాడు. కౌలు ఎట్లా కట్టాలి, పెట్టుబడి ఎట్లా ఎల్లాలి, కుటుంబం ఎట్లా గడవాలి అని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి పంటలకు సరిపడా నీళ్లు, కరెంట్ సరఫరా చేయాలని కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burns crop | నీళ్లు లేక కరెంట్ రాక.. సూర్యాపేట జిల్లాలో పంటను కాలబెట్టిన కౌలు రైతు
AP News | తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం.. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు..!
Ishan Kishan | ఇషాన్ కిషన్ కోలుకుంటున్నాడు.. అయినా మూడో టీ20కి దూరం.. బీసీసీఐ కీలక ప్రకటన!
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

