జర్నలిస్టుల స్థలాన్ని లాకోవడం అన్యాయం
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం గతంలో కేటాయించిన స్థలాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులను పంపి సీజ్ చేయించడం కాంగ్రెస్ సర్కార్కే చెల్లిందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
- తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం గతంలో కేటాయించిన స్థలాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులను పంపి సీజ్ చేయించడం కాంగ్రెస్ సర్కార్కే చెల్లిందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. జేఎన్జే హౌసింగ్ సొసైటీ సభ్యుల కోసం గతంలో నిజాంపేటలో సర్వే నంబర్ 332లో కేటాయించిన 32 ఎకరాల స్థలాన్ని పోలీసుల పహారా మధ్య స్వాధీన పరుచుకొని, రెవెన్యూ అధికారులచేత ఏకంగా సీలు వేయించడం ఏందని ఆ సంఘం అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతీసాగర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
18 ఏండ్ల క్రితం కోట్లాది రూపాయలు చెల్లించిన సొసైటీ సభ్యులకు ఇప్పుడు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా జర్నలిస్టులకు ఇప్పటికీ ఇండ్ల స్థలాలు దకలేదని, పైగా గతంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి జేఎన్జే సొసైటీకి ఇచ్చిన నిజాంపేట స్థలాన్ని కూడా గురువారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడం జర్నలిస్టులను మోసం చేయడమేనని పేర్కొన్నారు.
కొద్దిరోజుల క్రితమే రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీపావళికి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో మాట్లాడుతూ.. డిసెంబర్ 9న ఫ్యూచర్‌సిటీలో జర్నలిస్టులకు ఇండ్ట స్థలాలు ఇస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఇలా పరస్పర విరుద్ధ ప్రకటనలతో జర్నలిస్టులను వంచిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే పలుమార్లు జర్నలిస్టులకు హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఆ మాటను నిలబెట్టుకోకపోగా, ఉన్న స్థలాన్ని కూడా లాకోవడం చూస్తుంటే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
రూ.వందల కోట్ల విలువ చేసే స్థలాన్ని సీజ్ చేసి ముందుగా తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, చిట్‌చాట్‌లో ప్రకటనలు చేయడం కాకుండా ఒక స్పష్టమైన విధాన ప్రకటనను డాక్యుమెంట్ రూపంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కేటాయింపు విషయంలో నమ్ముతారని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

