Telangana | తెలంగాణ ప్రగతి దేశానికే ఆదర్శం : ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం
Telangana | తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే బీఆర్ఎస్(BRS) జెండా దేశ ప్రజలకు అండగా నిలుస్తుందని రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం పేర్కొన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే బీఆర్ఎస్(BRS) జెండా దేశ ప్రజలకు అండగా నిలుస్తుందని రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన నాయకులకు, పార్టీశ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ (CM KCR)పాలనలో తెలంగాణలో సాధించిన ప్రగతి(Development) దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
దేశ ప్రజల శ్రేయస్సు కోసమే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని వెల్లడించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి దేశ ప్రజలంతా కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను బీఆర్ఎస్ శ్రేణులు(BRS Cadre ) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
2001 నుంచి నేటి వరకూ 23 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుందని అన్నారు. స్వరాష్ట్రం కోసం ఉద్యమంలోనే కాకుండా బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ అవకాశం కల్పించినందుకు బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

