Yasangi Paddy Cultivation | యాసంగికి నీళ్లు, కరెంట్ ఇవ్వం.. సాగు చేయొద్దంటున్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
Yasangi Paddy Cultivation | యాసంగి పంటకు సాగునీరు, కరెంట్ సరఫరా చేయలేమని మంత్ర పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాకు వచ్చిన మంత్రి పొంగులేటి ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, అధికారులతో జడ్పీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించగా మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ పాల్గొన్నారు. భూముల రీ సర్వే, ఇందిరమ్మ ఇండ్ల పురోగతి తదితర అంశాలపై సమీక్షించారు.
Yasangi Paddy Cultivation | సంగారెడ్డి, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : యాసంగి పంటకు సాగునీరు, కరెంట్ సరఫరా చేయలేమని మంత్ర పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాకు వచ్చిన మంత్రి పొంగులేటి ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, అధికారులతో జడ్పీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించగా మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ పాల్గొన్నారు. భూముల రీ సర్వే, ఇందిరమ్మ ఇండ్ల పురోగతి తదితర అంశాలపై సమీక్షించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం ఉందని, దీనిపై ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఎల్ నినోపై కేంద్రంను ఎలాంటి సహాయం కోరాలి అనేది చర్చించేందుకు బుధవారం అఖిలపక్షంతో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు తగ్గుతున్నందున రాష్ట్రంలో తాగునీరు, కరెంటు కొరత పెరిగే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు వరి సాగు చేయవద్దని, ప్రభుత్వం రెండో పంటకు నీరు ఇవ్వలేదని తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వేదికపై కుర్చీలు వేయని అధికారులు
సమీక్షా సమావేశం వేదికపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కుర్చీలు వేయకపోవడంతో ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాణిక్‌రావు అధికారులతోపాటు కుర్చీల్లో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పందిస్తూ వేదికపై ఉన్న బ్యానర్లో కనీసం సీఎం, మంత్రుల ఫొటోలు ముద్రించక వారినే అవమానించారు.. తమనేం గౌరవిస్తారు? ఇదేం సమావేశమని పేర్కొన్నారు. మంత్రి దామోదర స్పందిస్తూ వేదికపై కుర్చీలు ఏర్పాటు చేశామని.. పైకి రావాలని కోరడంతో బీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వేదికపై కూర్చున్నారు.
మీడియా ప్రతినిధులకు అండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సమీక్షా సమావేశానికి మీడియాను అనుమతించని విషయం గమనించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్‌రావు.. మంత్రులు, అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాను సమీక్షా సమావేశానికి అనుమతించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టినా మంత్రి పొంగులేటి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించమని తెలిపారు. దీంతో సమావేశమందిరంలో ఉన్న మీడియా ప్రతినిధులు బయటకు వెళ్లాల్సి వచ్చింది.
యాసంగిలో వరిసాగు వద్దు: తుమ్మల
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడనున్నందున యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్, ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎల్ నినో పరిస్థితులు, భూగర్భజలాల లభ్యత, వ్యవసాయం, తాగునీటి సరఫరా, విద్యుత్తు వినియోగం తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు తమ శాఖల పరిధిలోని పరిస్థితులను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు
. మంత్రి తుమ్మల మాట్లాడుతూ వానకాలం పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని, యాసంగిలో వరికి బదులుగా తక్కువ నీటితో పండే పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ జలమట్టాలు తగ్గుతున్న తీరుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పప్పులు, చిరుధాన్యాలు, కూరగాయలు, తక్కువ నీటితో పండే పంటలను సాగుచేసేలా వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని, అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yasangi Paddy Cultivation | యాసంగికి నీళ్లు, కరెంట్ ఇవ్వం.. సాగు చేయొద్దంటున్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
RTC Elections | ఆర్టీసీ కార్మికలోకం కుతకుత.. గుర్తిపు సంఘం ఎన్నికల ఫలితాల తారుమారుపై కన్నెర్ర
Parental Controls | పిల్లల వాట్సప్ వాడకంపై తల్లిదండ్రులకే కంట్రోల్..కొత్త ఫీచర్లతో మెటా కీలక నిర్ణయం!
Birth Control Pill | మహిళలకే కాదు.. పురుషులకూ గర్భనిరోధక మాత్ర?.. అరగంట ముందు వేసుకుంటే చాలు!
KTR | కేటీఆర్ పాస్‌పోర్ట్‌పై స్టేటస్కో.. జప్తు చర్యలకు హైకోర్టు బ్రేక్.. నవంబర్ 6 వరకు యథాతథ స్థితి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

