పవర్ హాలిడే దిశగా రాష్ట్రం
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం ముదురుతున్నదా? రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌ను రాష్ట్రం తీర్చలేదా? మొత్తంగా పవర్ హాలిడే దిశగా అడుగులేస్తున్నదా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.
- వారంలో ఒకట్రెండు రోజులు బంద్?
- ఇప్పటికే సాగుకు రాత్రిపూట కోత
రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌ను తట్టుకోలేక చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్ పవర్ హాలిడే దిశగా పరుగులు పెడుతున్నట్టు తెలుస్తున్నది. ఇకపై వారంలో రెండు రోజులు లేదంటే ఒక రోజు పవర్ హాలిడే ప్రకటించే దిశగా చర్చలు జరుపుతున్నది. ఓవైపు వ్యవసాయం, మరోవైపు పరిశ్రమలకే కాకుండా గృహ వినియోగదారులకు సైతం కోతల వెతలు తప్పని దుస్థితి నెలకొన్నది
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం ముదురుతున్నదా? రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌ను రాష్ట్రం తీర్చలేదా? మొత్తంగా పవర్ హాలిడే దిశగా అడుగులేస్తున్నదా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. వారంలో రెండు రోజులు లేదంటే ఒకరోజు పవర్ హాలిడే ప్రకటించాలన్న చర్చలు ప్రభుత్వంలో నడుస్తున్నాయి. ఇప్పటికే వ్యవసాయానికి ప్రభుత్వం రాత్రిపూట పవర్ హాలిడే ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే విద్యుత్తును సరఫరా చేస్తున్నది.
పరిశ్రమలకు ప్రత్యేకించి సాయంత్రం పూట పీక్ డిమాండ్ నేపథ్యంలో లోడ్ రిలీఫ్ పేరిట కరెంటు కోతలు అమలు చేస్తున్నారు. కరెంటు అందక.. అప్రకటిత కోతలతో పంటలు ఎండిపోతున్నాయి. రైతాంగం రోడ్డెక్కుతున్నది. సబ్స్టేషన్లను ముట్టడిస్తున్నారు. ఇదిలా ఉండగా వ్యవసాయ శాఖ వరి వేయొద్దని హెచ్చరిస్తున్నది. రైతుల నుంచి డిక్లరేషన్లు తీసుకుంటున్నారనే వార్తలొస్తున్నాయి. వరి విత్తనాలు విక్రయించకుండా కట్టడిచేస్తున్నది. ఇదే తరహాలో వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ రంగానికి పవర్ హాలిడేను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్ర చరిత్రలో షార్టేజ్
రాష్ట్ర చరిత్రలో తొలిసారి విద్యుత్తు లోటు ఏర్పడింది. అక్టోబర్ 8 నుంచి 10వ తేదీ వరకు తొలిసారిగా రాష్ట్రంలో పవర్ లోటు (షార్టేజ్) ఏర్పడింది. ఆ తర్వాత 12,13,14 తేదీల్లోనూ ఈ లోటు పునరావృతమైంది. ఈ నేపథ్యంలో పగలు 19 గిగావాట్లు, రాత్రి 9 గిగావాట్ల విద్యుత్తును మాత్రమే సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టారు. విద్యుత్తు డిమాండ్ పెరుగకుండా కట్టడి చేస్తున్నారు. ఫీడర్ల వారీగా కోతలు అమలు చేస్తున్నారు. ప్రత్యేకించి డిమాండ్ పెరిగిన ప్రతిసారీ వ్యవసాయ విద్యుత్తుపైనే వేటు వేస్తున్నారు. వ్యవసాయ విద్యుత్తుకు సరఫరా నిలిపివేస్తున్నారు.
27 వేల మెగావాట్లు దాటే చాన్స్
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ మరిం త పెరిగే అవకాశం కనిపిస్తుస్తున్నది. ఈ నెలలోనే విద్యుత్తు గరిష్ఠ డిమాండ్ 20 వేల మెగావాట్లు దాటింది. రాబోయే రో జుల్లో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ 23 వేల మెగావాట్లు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో 27 వేల మెగావాట్లకు చేరుతుందని భావిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

