Vinod Kumar | తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి : వినోద్ కుమార్
Vinod Kumar | కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(,Boinapalli Vinod Kumar) అన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించడమే కాకుండా ఖాజీపేట్ రైల్వేకోచ్ ప్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(,Boinapalli Vinod Kumar) అన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించడమే కాకుండా ఖాజీపేట్ రైల్వేకోచ్ ప్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నవోదయ విద్యాలయాలు(Navodayas) మంజూరు చేయాలి.
మోదీ మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలపై గత పదేళ్ల కాలంలో దృష్టి పెట్టడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈసారి తెలుగుదేశం పార్టీ పై ఆధారపడి మోదీ కేంద్ర ప్రభుత్వం నడపాల్సి వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొస్తాతీరంలో రూ0వేల కోట్లతో పెట్రో కెమికల్ ప్రాజెక్టుకు క్లియరెన్స్ వచ్చినట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయుడు కొంత మేరకు నిధుల కేటాయింపులు చేసుకుంటున్నట్లు తెలుస్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెండు జాతీయ పార్టీల నుంచి బీజేపీ 8, కాంగ్రెస్ 8, ఎంఐఎం 1పార్లమెంట్ స్థానాలు గెలిచాయి. ఈ నేపథ్యంలో ఆయా ఎంపీలు రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు తీసుకురావాలన్నారు. బీఆర్ఎస్ ఎంపీలుగా తాము ఉన్నప్పుడు చాలా అంశాలను పార్లమెంట్లో లేవనెత్తి రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకున్నామని పేర్కొన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు గత 15 రోజుల నుంచి కేంద్రానికి ఎలాంటి వినతిపత్రాలు ఇవ్వలేదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ఒక రోజు మాత్రమే సమయం ఉంది. బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే. అరుణ నేడు, రేపు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్ట్‌ల విషయంలో కేంద్రం పై ఒత్తిడి తేవాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

