Kethaki Temple | కేతకి ఆలయాన్ని సందర్శించిన తెలంగాణ హైకోర్టు జడ్జిలు
Kethaki Temple | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిలు జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, జస్టిస్ పి. శ్రీసుధ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Kethaki Temple | ఝరాసంగం, ఏప్రిల్ 5 : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిలు జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, జస్టిస్ పి. శ్రీసుధ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా జడ్జిలకు ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాలు మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఆలయ ఆవరణలోని అమృత గుండంలో పాదాచారణ చేసి గర్భగుడిలోని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి అభిషేకం, మంగళహారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జడ్జీలకు ఆలయ కార్యనిర్వాహణ అధికారి శివ రుద్రప్ప పూలమాల శాలువాతో సన్మానించి స్వామివారి ప్రసాదంతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. జడ్జిల వెంట సంగారెడ్డి జిల్లా జడ్జి భవాని చంద్ర, జహీరాబాద్ జడ్జి శ్రీధర్, ఆర్డీవో రామ్ రెడ్డి, డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ తిరుమలరావు, ఆర్ఐ రామారావు, శేఖర్ పటేల్ లు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

